పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్ధ్యం పెంచాలని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు . పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపు వల్ల హైదరబాద్ నగర , మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తాగు , సాగునీటి అవసరాలకు సరిపడా  నీళ్లు దక్కని  పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు .అయితే హరీష్ వాదనల్లో ఏమాత్రం నిజం లేదని అంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు .  సముద్రంలో వృధాగా కలిసే వరదజలాలను మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ జిల్లాలకు  తరలించాలని నిర్ణయించినట్లు చెప్పారు .

 

పోతిరెడ్డి  పాడు   ప్రస్తుత సామర్ధ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించిన జగన్ సర్కార్  , ఈ మేరకు ఏకపక్షంగా జీవో జారీ చేయడాన్ని కెసిఆర్ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా , ఈ విషయమై  కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అఫెక్స్ కమిటీకి , రివర్ బోర్డు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది . పోతిరెడ్డి  పాడు  సామర్ధ్యాన్ని పెంచాలన్న అంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బిజెపి నాయకత్వం ఒకరోజు నిరసన దీక్షకు దిగాలని నిర్ణయించడం తో , తెలంగాణలోఒక్కసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది . బిజెపి నిర్ణయంతో  కెసిఆర్ సర్కార్  ఆత్మరక్షణలో  పడిననట్లు కనిపిస్తోంది . విపక్షాల విమర్శలను తిప్పికొట్టే క్రమంలో  అంధ్రప్రదేశ్ సర్కార్ తీసుకువచ్చిన జీవోపై  కెసిఆర్ సర్కార్ ఎదురు దాడి  తీవ్రతరం చేసింది . దీనితో  తొలిసారిగా  రెండు రాష్ర్టాల  మద్య యుద్ధ వాతావరణం నెలకొంది . 

 

ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య , ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కన్పించేది , అయితే పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచాలన్న జగన్ సర్కార్ నిర్ణయం పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు . ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనగ్గి తగ్గేది లేదని తేల్చి చెప్పారు . న్యాయపోరానికి సిద్ధమని ప్రకటించారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: