ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను అతలాకుతలం చేస్తూ ఉంది. ఈ విపత్తు నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రేషన్ కార్డు ఆధార్ నెంబర్ చేత చేయలేదన్న కారణంతో ఎక్కడ కూడా ఏ ఒక్కరికి  రేషన్ సరుకులు సరఫరా నిలపి వేయవద్దు అని కేంద్ర క‌న్జ్యూమ‌ర్ ఎఫైర్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రివర్గ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఆధార్ సిడింగ్ గడువును కూడా సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలియజేయడం జరిగింది. 


ఇక అప్పటి వరకు ఆధార్ లేదని గాని ఆధార్ లింక్ చేయలేదు అని కానీ ఎవరి పేర్లను కూడా రేషన్ కార్డు నుంచి తొలగించవద్దు అని కేంద్ర ప్రభుత్వం అధికారులకు వెల్లడించింది. అలాగే అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు అన్ని రాష్ట్రాలలో ఈ గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇక అప్పటి వరకు రేషన్ లబ్ధిదారులు అందరికీ.. వారికి సరఫరా అవ్వాల్సిన రేషన్ సరుకులు అన్నీ కూడా ఇవ్వాలి అని అధికారులకు తెలియజేసింది. అలాగే లబ్ధిదారుడి ఆధార్ కార్డు లేకపోయినా కూడా ఇవ్వాలని తెలిపింది. 


ఇక అర్హులైన ఏ ఒక్కరికి కూడా రేషన్ ఇవ్వడానికి నిరాకరించవద్దు అని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశించింది. వీటితో పాటు ఆహార భద్రత కల్పించాలి ఎవరైనా బయోమెట్రిక్ మిషన్లు వేలిముద్ర సరిగ్గా పడలేదని రేషన్ ఇవ్వడం మానకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలియచేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏ పేదరిక వ్యక్తి కూడా ఆకలితో అలమటించు కుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 90 శాతం ఆధార్ కార్డు లింక్ పూర్తయింది. ఇక మొత్తం దేశవ్యాప్తంగా 23.5 కోట్ల రేషన్ కార్డులు లబ్ధిదారుల ఆధార్ కార్డు నెంబర్ తో పూర్తి అయ్యింది.  అంతేకాకుండా సుమారు 85% మంది రేషన్ కార్డులకు సంబంధించిన ఫ్యామిలీలో ఉన్న అందరూ ఫీడింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: