కరోనా వైరస్ పుణ్యమా చైనా దేశం పై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. చైనా దేశం కావాలని ఈ వైరస్ గురించి ప్రపంచ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేయాలని తన స్వార్థం కోసం కరోనా వైరస్ సృష్టించిందని అన్ని దేశాలు అనుకుంటున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అయితే ఇది కరోనా వైరస్ కాదు చైనా వైరస్ అని అంటుంది. కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి ఓ రేంజ్ లో డ్రాగన్ కంట్రీ పై విరుచుకుపడుతుంది అగ్రరాజ్యం. ఆ దేశంలో ఉన్న తమ కంపెనీలను వెంటనే వెనక్కి రావాలని అమెరికా ప్రభుత్వం సూచిస్తుంది. అందుకుగాను వెనక్కి వస్తే భారీ ప్యాకేజీలు అందిస్తామని కంపెనీ సీఈఓ లకు అమెరికా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంది.

 

అమెరికాలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఉన్నా సాధారణ ప్రజలకు కూడా చైనా పై తీవ్ర ఆగ్రహం నెలకొంది. దీంతో చాలామంది కంపెనీ సీఈవో లకు చైనా ని వీడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదే ఇప్పుడు ఇండియాకి పెద్ద వరంగా మారింది. చైనా నుండి అమెరికా దిగ్గజ కంపెనీ యాపిల్ ఇండియాకి రావాలని నిర్ణయించుకుంది. ఒకేసారి తరలించడం కన్నా విడతలవారీగా తరలించాలని అనుకుంటుంది. ముందుగా చైనా యూనిట్ లోని మూడోవంతు ఇకనుండి ఇండియాలోనే ఉత్పత్తి చేయాలని డిసైడ్ అయింది.

 

యాపిల్ కంపెనీ తన కంపెనీ ఎక్కడ ప్రారంభిస్తుందో, ఎప్పుడు ప్రారంభిస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు యాపిల్ కంపెనీ నీ తమ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలని పదుల సంఖ్యలో సీఎంలు ఆ కంపెనీ సీఈఓ ని  మెప్పించే పనిలో పడ్డాయి. యాపిల్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఈ కంపెనీ ఉత్పత్తులను ఉపయోగించడం అంటేనే ఒక బ్రాండ్ గా భావిస్తారు. అటువంటి కంపెనీ ఇప్పుడు ఇండియా వైపు చూడటంతో చైనా దేశంలో ఉన్న మిగతా బిగ్ కంపెనీలు కూడా ఇండియా వైపు చూస్తున్నాయి. చాలా వరకు ఇండియాలో చైనాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నట్లు అంతర్జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: