ఊహించని విధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. గతంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా, ఆ రెండు ప్రభుత్వాలకు తారాస్థాయిలో నీటి యుద్ధం జరిగేది. కానీ ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలకు చెక్ పడ్డాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు సన్నిహితంగా ఉంటూ సమస్యలు పరిష్కారం చేసుకుంటూ వచ్చారు.

 

కానీ తాజాగా జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203 మరో వివాదానికి కారణమైంది. పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచే ఏపీ జీఓ 203పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం  చేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏక పక్షంగా ఉందని ఫైర్ అవుతున్నారు. ఇక దీనిపై కృష్ణా రివర్ బోర్డుకు  కూడా  ఫిర్యాదు చేశారు. శ్రీశైలం కొత్త లిఫ్ట్ స్కీం ఏర్పాటు చేయడం అన్యాయమని ఫిర్యాదులో పేర్కొంది.

 

అయితే దీని వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో... పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటి పరిమాణాన్ని పెంచాలని నిర్ణయించుకున్నామని అంటుంది. కాకపోతే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య నీటి గొడవ పెట్టడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెబుతోంది. ఇక ఈ రెండు ప్రభుత్వాల వాదన ఇలా ఉంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం వేరే వాదన చేస్తోంది.

 

కేసీఆర్, జగన్ తో కుమ్మక్కయ్యి తెలంగాణ హక్కుల్ని కాలరాస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈక్రమంలోనే వారి కూడా పోతిరెడ్డిపాడుపై సరిగా మాట్లాడటం లేదు. ఒక నేత పోతిరెడ్డిపాడు వల్ల మొదట నుంచి తెలంగాణకు అన్యాయం జరిగిందని అంటుంటే, మరో నేత మొదటి నుంచి అన్యాయం జరిగిందనే దానిలో వాస్తవం లేదని, ఆనాడు పోతిరెడ్డిపాడుకు కేబినెట్ ఆమోదం తెలిపితే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని అంటున్నారు. మొత్తానికైతే పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుతూ ఏపీ తెచ్చిన జీవో పై మాత్రం తెలంగాణ ప్రభుత్వం గుర్రుగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: