జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య నీతి సూత్రాలు ఎక్కువగా చెబుతున్నారు. కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి రాజకీయం జోలికి వెళ్లనని చెప్పిన పవన్..వేదంతాలు మాట్లాడుతూ..జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్సలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

 

బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాల్సిన తరుణం ఇదే అని, ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రజా ప్రతినిధులను బలంగా ప్రశ్నించాలని పవన్  అంటున్నారు. అయితే ఇంత బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలని ప్రశ్నిస్తున్న పవన్...గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి డైలాగులు ఎందుకు అనలేదని వైసీపీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

 

చంద్రబాబు తప్పులు చేసిన ప్రతిసారి పవన్ వచ్చి కవర్ చేసేవారని, ప్రశ్నించాలనంటున్న పవన్, గతంలో ఎన్నిసార్లు ప్రశ్నించారో గుర్తు చేసుకోవాలని కోరుతున్నారు. ఇక బాధ్యతగల రాజకీయ పార్టీగా జనసేన ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మొన్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన రహస్య ఒప్పందం కుదుర్చుకున్న సంగతి అందరికీ తెలుసని అంటున్నారు. వైసీపీని దెబ్బకొట్టడానికి జనసేన తరుపున డమ్మీ అభ్యర్ధులని నిలబెట్టారని, వాళ్ళని కూడా బాబే ఎంపిక చేశారన్న సంగతి తెలుసని, అందుకే ప్రజలు ఇవన్నీ గమనించి పవన్ ని కూడా చిత్తుగా ఓడించారని వైసీపీ వాళ్ళు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

 

ఇక బాధ్యతగా వ్యవహరించే పవన్...ఏపీలో కరోనా టెస్టులు ఎక్కువ చేస్తున్నా సరే...కరోనాకు సంబంధించిన పరీక్షలు కూడా ఎక్కువగా చేయడం లేదని ఎలా మాట్లాడుగలుగుతున్నారని, పైగా పాజిటివ్ కేసులు ప్రకటిస్తున్న వాటికంటే ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటున్నాయని ఎలా చెప్పగలుగుతున్నారని అడుగుతున్నారు. అయిన ఇప్పటికి పవన్ బాబు డైరక్షన్ లోనే పనిచేస్తున్నారని, ఆ విషయం ఆయన మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోందని, అలాంటప్పుడు బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ గురించి పవన్ కు మాట్లాడే అర్హత లేదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: