జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ ఏదోరకంగా రాజకీయం చేస్తూనే వస్తున్న విషయం తెలిసిందే. వారికి అవకాశం దొరికిన ప్రతిచోటా జగన్ ప్రభుత్వంపై విమర్సలు చేసారు. తాజాగా కూడా కరోనా, విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరెంట్ బిల్ రూపంలో టీడీపీకి మరో అస్త్రం దొరికినట్లు కనిపిస్తోంది. ఒక్కసారిగా విద్యుత్ చార్జీలు ఎక్కువగా రావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

 

లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మార్చి నెల కరెంట్ రీడింగ్ తీయకుండానే, అంతకముందు నెల ఎంతవస్తే అంత బిల్ జనరేట్ చేసి, ప్రజల్ని ఆన్ లైన్ లో కట్టమన్నారు. దీంతో కొందరు అలాగే కట్టారు. కాకపోతే తాజాగా కరెంట్ రీడింగ్ తీయడం మొదలుపెట్టడంతో, రెండు నెలలు బిల్ కలిపి తీసి ప్రజలకు ఇస్తున్నారు. దీని వల్ల బిల్లు అధికంగా వస్తుంది. అయితే ఆన్ లైన్ లో కడితే ఆ ఎమౌంట్ తగ్గించి బిల్ ఇస్తున్నారు.

 

అయితే ఇలా చేసిన కూడా ప్రజలకు నష్టమే ఎందుకంటే రెండు నెలల రీడింగ్ తీస్తే ఎక్కువ యూనిట్లు వస్తాయి. యూనిట్ల బట్టి  స్లాబుల్లో మార్పు ఉండటం వల్ల ఎక్కువ బిల్ పడుతుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్న అధిక కరెంట్ బిల్లులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే విషయాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది.

 

కరోనా కానుకగా కరెంట్ బిల్లులు పెంచారని ఎద్దేవా చేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదని,  60 రోజులు పనులు లేక ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ కరోనా కానుకగా కరెంటు ఛార్జీలు పెంచారని,పెంచిన కరెంట్ బిల్లులను ఎవ్వరూ చెల్లించవద్దని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కరెంటు బిల్లులను రద్దు చేయకపోతే టీడీపీ ఉద్యమం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే టీడీపీ దీన్ని రాజకీయంగా వాడుకోకముందే కరెంట్ బిల్లుల్లో ఉన్న సమస్యలని పరిష్కరిస్తే మంచిందని విశ్లేషకులు అంటున్నారు. లేదంటే ఈ అంశం కాస్త ప్రభుత్వానికి నెగిటివ్ అయ్యే అవకాశముందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: