దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలన్నా చెప్పింది ఆచరణలో చేసి చూపించాలన్న జగన్ ని మించిన రాజకీయ నాయకుడు దేశంలో మరొకరు ఉండరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా వరకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల విషయంలో అధికారంలోకి వచ్చాక నాయకుల మాట తీరు మారిపోతాయి. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగానే వ్యవహరించడంతో ప్రజలు ఇంటికి పంపించడం జరిగింది. కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా నవరత్నాలను అతి తక్కువ టైమ్ లోనే రాష్ట్రంలో అమలు చేస్తూ ప్రత్యర్థులకు దిమ్మతిరిగిపోయే విధంగా ప్రజలకు పరిపాలన అందిస్తున్నారు.

 

ఇటువంటి సమయములో రాజధాని విషయంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి సానుకూలమైన స్పందనే వచ్చింది. విశాఖపట్టణం నుండి పరిపాలన అందించాలని కరోనా వైరస్ రాకముందు జగన్ అనేక ఏర్పాట్లు చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా వైరస్ రావడంతో పూర్తిగా జగన్ అనుకున్న నిర్ణయాలు మొత్తం అటకెక్కాయి. ఇదే సమయంలో ఇటీవల విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అవడంతో ఈ విషయాన్ని అడ్డంపెట్టుకుని ప్రతిపక్షాలు కుట్ర చేయాలని ఆలోచిస్తున్నట్లు విశాఖకు రాజధాని రాకుండా చేయాలని వ్యూహాలు పన్నుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

 

దీంతో అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వకుండా మెల్లమెల్లగా ఉద్యోగులను విశాఖకు బదిలీ చేయించడానికి జగన్ రెడీ అవుతున్నట్లు వైసీపీ పార్టీలో టాక్. మొత్తం ఉద్యోగులను బదిలీ చేయకుండా ఆన్ డ్యూటీ పై జగన్ పని చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ప్లాన్ 24 గంటల్లో రూపొందించాలని అధికారులకు జగన్ సూచించినట్లు సమాచారం. మొత్తంమీద చూసుకుంటే సైలెంట్ గా రాజధాని తరలింపు ప్రక్రియ జోరుగా సాగుతుందని అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: