మొన్నటి వరకు అమరావతి వ్యవహారంపై ఏపీలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రాజధాని తరలింపు, మూడు రాజధానిలో వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇది ఇలా ఉండగానే ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రం కావడంత అమరావతి వ్యవహారం కాస్త పక్కకి వెళ్ళింది. అయితే తాజాగా మరోసారి ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం చర్చకు తెర తీసింది. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి అమరావతి పరిసర ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 33 వేల ఎకరాల్లో సుమారు నాలుగు వేల ఎకరాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి అనుమానిస్తోంది. దీంతో ఈ నాలుగు వేల ఎకరాల వ్యవహారాన్ని సిబిఐతో విచారణ చేయించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

 
 
దీని కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్ల ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో పెద్ద సంఖ్యలో అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన జరిగాయని అనుమానిస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం కూడా ఈ మేరకు నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.  ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములను సాగుచేసుకుంటున్న నిరుపేద దళిత రైతులను భయపెట్టి వారి భూములను గత ప్రభుత్వం లోని కొంతమంది పెద్దలు స్వాహా చేసినట్లు వైసీపీ మొదటి నచి ఆరోపిస్తోంది. 
 
 
ఈ వ్యవహారంలో టిడిపి పెద్దలు చాలామంది భారీగా లబ్ధి పొందినట్లు కూడా ఏపీ ప్రభుత్వం అనుమానిస్తోంది. దీనిలో భాగంగానే సిబిఐ దర్యాప్తుకు ఈ వ్యవహారాన్ని అప్పగించి టిడిపి నాయకులు బండారాన్ని బయట పెట్టాలని దృఢనిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. దీనిపైన ఏపీలో రాజకీయ దుమారం చెలరేగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ హైదరాబాద్ లోనే   ఉండిపోవడంతో ఈ వ్యవహారం ఏ విధమైన మలుపు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: