జగన్ కి విశాఖ మీద మోజు పుట్టింది. ఆయన ఆ విషయం ఎక్కడా దాచుకోలేదు. ఆయన ఆరు నెలల క్రితమే అసెంబ్లీలో ఈ విషయం చెప్పారు కూడా. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని కూడా ప్రకటించారు. సరే దాని తరువాత ఎన్ని ఆటంకాలు వచ్చాయో అంతా చూశారు. అవన్నీ అలా ఉంటే ఇపుడు ముహూర్తం కూడా ముంచుకొచ్చింది.

 

విశాఖకు పాలనా రాజధాని రావడానికి ముందు ముఖ్యమంత్రి ఆఫీస్ వస్తుందని అంటున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖకు మొదట వస్తుంది. ఆ తరువాత నెమ్మదిగా సచివాలయం వస్తంది. ఆ తరువాత అన్నీ వస్తాయి. ఇదీ వైసీపీ యాక్షన్ ప్లాన్. నిజానికి సీఎం క్యాంప్ ఆఫీస్ మార్చుకోవడానికి ఎటువంటి అడ్డంకులూ లేవు. పాలనా రాజధాని అంటే సచివాలయం వస్తుంది. దాంతోనే రగడ మొత్తం ఉంది.

 

దాంతో జగన్ మెల్లగా తొలి అడుగులు వేస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఇబ్బంది ఉండదు కదా. పైగా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పాలన సాగుతుందని జగనే చెప్పారు. అందుకే జగన్ ముందుగా క్యాంప్ ఆఫీస్ విశాఖకు తెస్తున్నారని అంటున్నారు. ఇక మే 28న ముహూర్తమని, దాన్ని విశాఖ శారదా పీఠాధిపతి నిర్ణయించారని అంటున్నారు. మరో వైపు విశాఖలో భద్రత లేదని ప్రచారం జరుగుతోంది.

 

ఆ సమయంలో ఏకంగా ముఖ్యమంత్రే విశాఖలో ఆఫీస్ పెట్టి మరీ  మకాం చేస్తే ఆ భరోసా చాలా గట్టిగా పనిచేస్తుందని కూడా జగన్ భావిస్తున్నారని అంటున్నారు. మరి జగన్ విశాఖ మకాం ఈసారి నిజం అవుతుందా. అంతా అనుకున్నట్లుగా జరుగుతుందా చూడాలి. మాట మీద నిలబడే జగన్ తాను తలచుకుంటే వెనక్కి చూడకుండా అనుకున్నది సాధిస్తారు కాబట్టి విశాఖ రాజధాని అన్నది జగన్ తప్పక చేస్తారని అంతా అనుకుంటున్నారు.  మరి అందరి చూపు ఇపుడు మే 28 మీదనే ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: