ఎవడి పేరు చెబితే ప్రపంచం మొత్తం గజగజ వణుకుతుందో వాడే కరోనా.. అవును ఇప్పుడు లోకం మొత్తం కరోనా గుప్పిట్లో ఉంది.. రాబోయే రోజుల్లో పూర్తిగా కరోనాతోనే సహవాసం చేయాలి.. ఒకరకంగా ఈ కరోనా మనం చెప్పినట్లుగా వినడానికి అది మనం పెంచుకుంటున్న పెంపుడు కుక్కకాదు.. సింహంలా సింగిల్‌గా వచ్చింది.. లక్షల్లో ప్రాణాలను బలి తీసుకుంటుంది.. అవును రాబోయే రోజులు అందరికి సివిల్ పరీక్ష లాంటివి.. ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉన్నారో కొత్త సంవత్సరం వేడుకలను చూస్తారు.. లేదంటే గోడమీద తగిలించే ఫోటోలా మారుతారు..

 

 

ఇప్పటి వరకు లాక్‌డౌన్ పేరిట ప్రభుత్వాలు ప్రజలను రక్షించాయి.. ఇక ముందు ఎవరికి వారే రక్షించుకొంటు, వారి కుటుంబాలను కూడా సురక్షితంగా కాపాడుకోవలసిన అవసరం ఏర్పడింది.. ఇకపోతే  ప్రపంచమంతా కరోనాను కట్టడి చేసేందుకు తీవ్రంగా పోరాడుతోంది. ఇందుకు గాను ఎన్నో రూల్స్ పెట్టుకున్నాం. వాటిని తప్పని సరిగా పాటించవలసిన అవసరం ఉన్నది.. కానీ బాధ్యత మరచి ఏమాత్రం బుద్ధి లేకుండా ప్రవర్తించిన ఒక వ్యక్తికి బుద్ది వచ్చేలా చేసాడు ఓ పోలీస్ అధికారి.. ఆ వివరాలు తెలుసుకుంటే.. ఈ వైరస్ వ్యాపించకుండా ఎన్నో ఆంక్షలున్నాయి.. కానీ అందులో రోడ్లపైనే కాదు పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మి వేయకూడదు అనే రూల్ ఒకటి పెట్టిన విషయం తెలిసిందే..

 

 

ఒకవేళ పొగరుతో ఈ రూల్స్ అతిక్రమిస్తే ఫైన్లు వేసి ఊరుకుంటారని మాత్రం ఊహించకండి.. ఎందుకంటే ఒక వ్యక్తి చండీఘర్‌లో ఇలా చేసినందుకు తగిన విధంగా బుద్ధి చెప్పారు.. అది మామూలుగా లేదండోయ్.. ఎలా ఉందంటే.. చండీఘర్‌లో నడిరోడ్డుపై, టూవీలర్‌పై వెళుతున్న ఓ యువకుడు తనను ఎవరూ గమనించడం లేదనుకున్నాడు కావచ్చూ, తుపుక్కున ఉమ్మి వేశాడు. కానీ ఈ ఘటనను ఓ పోలీస్ అధికారి చూశాడు.. ఆ వెంటనే అతన్ని ఆపి ఫైన్ వేశాడనుకుంటున్నారు కదూ.. కానే కాదు.. మరి ఏంచేశాడంటే.. నీ నోటితో నువ్వే ఉమ్మివేశావు కాబట్టి నీ చేతితో నువ్వే దాన్ని కడుగు అని ఓ వాటర్ బాటిల్ అతనికి ఇచ్చాడు.

 

 

ఇంకేముంది అన్ని మూసుకుని అతను చెప్పినట్లు చేశాడు ఆ యువకుడు.. అంతే కాదు ఇంకెప్పుడు ఇలా చేయను క్షమించండి అని కూడా చెప్పించాడు ఆ పోలీస్ అధికారి.. తప్పు చేసిన వారితో ఇలా చేపిస్తే కొంత వరకైనా మార్పు కనిపిస్తుంది కానీ ఫైన్‌వేసి  చేతులు దులుపుకుంటే, డబ్బులు కట్టి మరలా ఇలాంటి చెత్తపనులు చేస్తారు కొందరు మనుషులు.. అందుకే ఈ పోలీస్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అయ్యారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: