ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలకమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్. ఎప్పటినుండో పనులు జరుగుతున్న గాని అనేక సమస్యలు చుట్టూ ముడుతునే ఉన్నాయి. వైయస్ ఉన్న టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులు వేగవంతమయ్యాయి. వైఎస్ హయాంలోనే పోలవరం కుడికాలువ పూర్తవడం జరిగింది. అయితే ఆయన అనూహ్యంగా చనిపోవటం తర్వాత రాష్ట్రం విడిపోవటం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా పెద్దగా పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి శ్రద్ధ చూపిన దాఖలాలు లేవు. చాలా వరకు పోలవరం ప్రాజెక్టు ని చంద్రబాబు అసెంబ్లీలో 2018 లో అయిపోతుంది గుర్తుపెట్టుకోండి..రాసిపెట్టుకోండి అనే ప్రకటనలు ఇచ్చారు గాని పనితనంలో పెద్దగా రాణించలేకపోయారు.

 

అయితే ఆ తర్వాత వచ్చిన జగన్ పోలవరం ప్రాజెక్టు లో చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలను బయటపెట్టి కాంట్రాక్టులను మార్చడం జరిగింది. చాలా వరకు పనులు కొనసాగుతున్న తరుణంలో కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లాక్ డౌన్ తో మళ్లీ ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వాస్తవానికి చూసుకుంటే పోలవరం పనులు ఎప్పుడు వర్షాకాలంలో జరగవు. అలాంటిది వర్షాకాలం వచ్చేస్తున్న తరుణంలో పోలవరం ప్రాజెక్టు పనులు చేయాలని వచ్చిన వలస కూలీలు ఇప్పుడు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో మళ్లీ ఆరునెలలపాటు పనులు జరిగే అవకాశం లేదని మళ్లీ నవంబర్ వరకు పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి మాట్లాడుకునే పనిలేదని మేధావులు అంటున్నారు.

 

మరోపక్క వచ్చే సంవత్సరం లోపు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని జగన్ సర్కార్ ప్రకటనలు ఇవ్వటం జరిగింది. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ రావటం పోలవరం ప్రాజెక్టు పనులు చేయాలని వచ్చిన వలస కూలీలు వెళ్లిపోవడంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మొన్నటిదాకా పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి నిధుల విషయంలో కేంద్రం దగ్గర సమస్య ఏర్పడక తాజాగా ప్రకృతి రూపంలో అనగా కరోనా వైరస్ రూపంలో పోలవరం ప్రాజెక్టు పనులు ఆగిపోవటం నిజంగా ఏపీ రాష్ట్రానికి బ్యాడ్ అని చెప్పవచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి: