మోడీ మీద ఎపుడూ జనాలకు కోటి ఆశలు. మొత్తం 135 భారతీయుల ఆకాంక్షలకు ఆయననుప్రతిబింబంగా చూస్తారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని నాయకత్వం మనకు ఉంది. మోడీ మన వెంట ఉన్నాడు అన్నది భారతీయుల గట్టి నమ్మకం. అందుకే మోడీ ఏం చెబితే అదే చేశారు. ఇపుడు కూడా మోడీ ఏం చేయబోతున్నారో అని ఆసక్తిగా చూస్తున్నారు. 

 

మోడీ అద్భుత భారతాన్ని ఆవిష్కరిస్తారని భారతీయులంతా కోరుకుంటున్నారు. లాక్ డౌన్ వేళ భారత్ కొత్త పాఠాలు నేర్చుకుంది. తన శక్తి తాను తెలుసుకుంది. నిజంగా ప్రధాని మోడీ అన్నట్లుగా మనం దిగుమతి కోసం ఎదురుచూడలేదు, దిగుమతి సరకు కోసం  అసలు ప్రయత్నం చేయలేదు. ఈ యాభై రోజులు మన ఉత్పత్తులు మనం వాడుకున్నాం. మన సంపదను మనం అనుభవించాం. నిజంగా ఆలోచిస్తే  ఇదే నిజం.

 

కరోనా మహమ్మారి హడలుకొడుతున్న వేళ రెండవ వైపు ఉన్న గొప్ప కోణం ఇది. దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చక్కగా చెప్పారు. మన ఆర్ధిక వ్యవస్థకు ఈ చర్యలు ఊతమిస్తాయని, మన సామర్ధ్యం  ఇక మరింత పెరగనున్నదని ఆయన అంటున్నారు. దానికి తగిన ప్రోత్సాహకాన్ని ఇచ్చేందుకు మోడీ భారీ ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించారు.

 

ఈ దేశ జీడీపీలో పదవ వంతు అంటే 20 లక్షల కోట్ల ప్యాకేజిని మోడీ ప్రకటించారు. దీన్ని భూమి, కార్మికులు, చట్టాలు, పెట్టుబడులుగా ప్రధాని చెప్పుకొచ్చారు. ఓ విధంగా గత డెబ్బయేళ్ళుగా మనమంటే ఏమిటో తెలియకుండా, మన సత్తా ఏంటో తెలియకుండా విదేశాల వైపే చూస్తూ పోతున్న భారత్ ని యాభై రోజులు తాళం పెట్టి ఆలొచించుకునే అవకాశం కరోనా ఇచ్చింది.

 

దాంతో మన మీద మనకు ధీమా వచ్చింది. భారతీయుల సత్తా గురించి పాలకులకూ ఒక అవగాహన వచ్చింది. అందుకే మోడీ విదేశం వద్దు, స్వదేశం ముద్దు అంటున్నారు. మనమే మన కోసం బతుకుదాం, ఎదుగుదాం, ప్రపంచాన్ని మన వైపునకు తిప్పుకుందామని అంటున్నారు. ఆ దిశగా మోడీ ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజి భారత్ దశ, దిశ మార్చేస్తుదనడంలో సందేహం లేదని ఆర్ధిక నిపుణులు కూడా అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: