కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం విధితమే.అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే 83 వేల మంది ప్రాణాలు కోల్పోయారు..14 లక్షల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వ్యాప్తంగా నిరుద్యోగం...ఆహార కొరత..ఆర్ధిక మామధ్యం ఇలాంటి ఎన్నో గడ్డుపరిస్థితులని ఎదుర్కుంటోంది. తాజాగా అమెరికా ఆర్ధిక రాజధానిలో పరిస్థితులు అదుపులోకి రావడంతో మరోమారు కరోనా ప్రభావం తమపై పడకుండా న్యూయార్క్ ప్రభుత్వం వినూత్న రీతిలో చర్యలు చేపట్టింది.

 

కరోనా మహమ్మారి లక్షణాలు బయట పడే వరకూ ఎవరికి వారు బయటకి ఈ వ్యాధి సోకిందని చెప్పడం లేదు. ఇళ్లలోనే ఉంటూ ఈ వైరస్ ని వ్యాప్తి చేస్తున్నారు. అలాగని ఎవరికి ఈ వైరస్ సోకింది అనే విషయం కూడా అంచనా వేయడం కష్టం కావడంతో న్యూయార్క్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచన చేసింది. కరోనా రోగులని..వారితో నేరుగా కాంటాక్ట్ అయిన వారిని గుర్తించడానికి ప్రభుత్వం గూఢచారులని నియమించింది.

 

కరోనా మహమ్మారి లక్షణాలు బయట పడితే ఎవరికీ వారు స్వచ్చందంగా వచ్చి బయటకి చెప్పే పరిస్థితులు ఎక్కడా కన్పించడంలేదు. కరోన బాధితులకి ప్రైమరీ కాంటాక్టులమని తెలిసినా కూడా వైరస్ లక్షణాలు కనిపించక పొతే ఎవరూ భయపడి బయటకి చెప్పుకోవడంలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే న్యూయార్క్ లో కరోనా  ఎప్పటికి తగ్గే అవకాశం లేదని చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు నిపుణులు..ఈ క్రమంలోనే ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది..

 

వీరి ముఖ్యమైన విధులు ఏమిటంటే..కరోనా సోకినా వారిని గుర్తించగలగడం..అలాగే కరోన రోగిని కలిసి  వారిని గురించి వారి వివరాలు కూడా ప్రభుత్వానికి తెలియ చేయడం. న్యూయార్క్ ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఈ చర్యలు తప్పనిసరని అంటున్నారు అధికారులు. కరోనా న్యూయార్క్ లో మళ్ళీ వ్యాప్తి చెందకుండా ఉండాలన్నా..న్యూయార్క్ ప్రజల ప్రాణాలు మరోమారు గాలిలో కలవకుండా ఉండాలన్నా ఈ చర్యలు తప్పని సరని ప్రభుత్వం ప్రకటించింది. వీరికి త్వరలో ఆన్లైన్ క్లాసులు కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా న్యూయార్క్ ప్రభుత్వం ప్రకటించింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: