తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు ద్వారా సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. పంట పెట్టుబడి సాయంగా ప్రతి పంటకి  ఐదువేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తూ... రైతులందరికీ అండగా నిలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇప్పటికే పలు దఫాలు కు సంబంధించిన రైతుబంధు ను  రైతులు తమ ఖాతాలో జమ వాటిని తీసుకున్నారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు మీకు ఇష్టమైన పంటను కాకుండా... ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు వేయాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. 

 

 

 రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పంట పండిస్తే గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోవాల్సి వస్తుందని అందుకే... ప్రభుత్వం సూచించిన విధంగానే రైతులు పంటలు వేయాలంటూ తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక రైతుబంధు విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ రైతులకు రైతుబంధు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మాత్రం... ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు వేసిన వారికి మాత్రమే రైతుబంధు వస్తుంది అంటూ తెలిపారు. 

 

 

 ఇక మీదట రైతులు తమ పొలంలో ఏ పంట ప్రభుత్వమే చెబుతుందని... ప్రభుత్వం చెప్పిన విధంగా పంట వేసిన వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి రైతుబంధు సొమ్ము అందుతుంది అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అందరూ ఒకే పంట వేస్తే గిట్టుబాటు ధర రాక రైతులు నష్ట పోవాల్సి వస్తుందని... అందుకే ప్రభుత్వం సూచించిన విధంగా మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా రైతులు పంటలు వేయాలి అని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఏడాది వరితోనే పంట మార్పు కావాలి అంటూ తెలిపారు. ఈ  వర్షాకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయడంతోపాటు 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలి అంటూ సూచించారు. కొత్తగా సీడ్  రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తామంటూ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: