భారత్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తూ 100 స్పీడ్ తో దూసుకుపోతుంది. మొన్నటి వరకు కేవలం 20 వేల వరకు మాత్రమే చేరిన కరోనా  కేసుల సంఖ్య తక్కువ కాలంలోనే ఏకంగా 70 వేల వరకు చేరింది. దీంతో భారత ప్రజలందరూ తీవ్ర భయాందోళన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారతదేశంలో ఇలాగే విజృంభిస్తే పరిస్థితులు చేయి దాటిపోయి దేశానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. మొన్నటి వరకు అతి తక్కువ కేసులో ఉన్న దేశాలలో ఒకటిగా ఉన్న భారత్ ప్రస్తుతం అతి ఎక్కువ కేసులు నమోదైన దేశాల జాబితాలో కి వెళ్ళిపోతుంది. 

 

 ముఖ్యంగా భారత్లోని కొన్ని రాష్ట్రాలలో అయితే పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారిపోతుంది. భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి  ప్రస్తుతం దేశానికి శాపంగా మారిందనే చెప్పాలి. అక్కడి ప్రభుత్వాలు సమర్థవంతంగా ఈ మహమ్మారి వైరస్ ను ఎదుర్కోలేక పోతున్నాయి... వెరసి రోజురోజుకు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగి పోతుంది. 20 వేల పాజిటివ్ కేసులు నుంచి డెబ్బై వేల పాజిటివ్ కేసులు పెరిగిపోవడానికి మధ్య ఉన్న సమయం అతి తక్కువే అని చెప్పాలి. తక్కువ సమయంలోనే 20 వేల నుంచి 70 వేల వరకు పాకి పోయింది కేసుల సంఖ్య. 

 

 

 గత 15 రోజుల క్రితం చూసుకుంటే ప్రపంచంలోనే అతి తక్కువ కరోనా వైరస్ కేసులు మరణాలు ఉన్న దేశాల జాబితాలో ఉన్న భారతదేశం...  కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచ దేశాలకు సైతం పోటీ ఇచ్చేలా  తయారయింది. మహమ్మారి వైరస్ విజృంభనతో   అత్యధిక కేసులు నమోదైన దేశాలకు సరసన చేర్చేందుకు సిద్ధమయింది భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ 12ప్లేస్ లో నిలిచింది. ఇక కరోనా  కు కేంద్ర బిందువైన చైనా దేశంతో పోలిస్తే కేవలం భారత్ లో ఎనిమిది వేల కేసులు మాత్రమే తక్కువగా ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఏకంగా చైనాను సైతం వెనక్కి నెట్టే  అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: