తమిళనాడులో రోజురోజుకు కరోనా  వైరస్ విజృంభిస్తుంది. క్రమక్రమంగా ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యింది. ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ... మొన్నటి వరకు తక్కువ ప్రభావం చూపిన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం మాత్రం విజృంభిస్తోంది. అయితే ఈ కరుణ వైరస్ పై  పోరాటంలో భాగంగా పోలీసులు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి ఈ వైరస్ పై పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మందిని ఈ మహమ్మారి వైరస్ బారినపడి చనిపోతున్నారు. 

 

 

 ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే పోలీసులు ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అయిపోతుంది. అయితే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఈ మహమ్మారి వైరస్ కోరలు చాస్తూ విజృంభిస్తోంది. రాష్ట్రంలోని సగానికి పైగా కేసులు కేవలం చెన్నై నగరంలోనే ఉన్నాయి. అయితే తాజాగా చెన్నై స్టాన్లీ  ఆస్పత్రిలో పనిచేసే హెల్త్ ఇన్స్పెక్టర్ సైతం కరోనా  వైరస్ బారిన పడాల్సిన దుస్థితి వచ్చింది. అంతేకాకుండా చెన్నైలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా ఈ మహమ్మారి వైరస్ బారిన ఉండడం మరింత ఆందోళన కలిగించే అంశంగా మారిపోయింది. ముఖ్యంగా ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్న పోలీస్ అధికారులు కూడా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. 

 

 

 అయితే తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఈ మహమ్మారి వైరస్ బారిన పడడంతో మొత్తంగా వైరస్ బారిన పడిన పోలీసులు బాధితుల సంఖ్య 190కు చేరింది. ఇదిలా ఉంటే కరోనా  వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న సమయంలో పూర్తిగా కట్టడి చేసి... ప్రస్తుతం కేసులు పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంపై ప్రజలు సతమతమవుతున్నారు. మొదటి కరోనా  వైరస్ కేసు నమోదు అయినప్పటి నుంచి ప్రభుత్వం ఎంతో కఠినంగా వ్యవహరించి కరోనా  వైరస్ ను కట్టడి చేసింది ఇక ప్రస్తుతం కరోనా  వైరస్ కొత్త కేసులు పెరుగుతున్న తరుణంలో.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో మాత్రం ప్రజల్లో  ఆందోళన నెలకొంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: