ప్రపంచాన్ని మొత్తాన్ని  కలవరపడుతూ  ఎంతో మందిని బలి తీసుకుంటు ఇంకా ఎంతోమంది మృత్యువుతో పోరాడేలా చేస్తుంది మహమ్మారి కరోనా వైరస్. దాదాపుగా అన్ని ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి వైరస్. ఎక్కడ కాస్తైనా కనికరం చూపించకుండా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇక ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చి  నెలలు గడుస్తున్నా ఈ మహమ్మారి వైరస్ కి ఇప్పటివరకు వ్యాక్సిన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నా ఎక్కడా సత్ఫలితాలు మాత్రం రావడం లేదు. 

 

 

 ప్రపంచ ప్రజానీకం మొత్తం ఈ మహమ్మారి వైరస్ కి సంబంధించిన వ్యాక్సిన్ గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇక ఈ మహమ్మారి వైరస్ ను ప్రపంచవ్యాప్తంగా తరిమి కొట్టాలి అంటే వ్యాక్సిన్ తప్పనిసరి అని నిపుణులు కూడా చెబుతున్న విషయం తెలిసిందే.ఇక ఈ మహమ్మారి టీకా కోసం ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎంతో నిరీక్షణ గా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలకు బ్రిటన్ ప్రధాని బోరింగ్ జాన్సన్ షాక్ ఇస్తూ నిరాశపరిచే వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ప్రకటన ప్రపంచ దేశాల ప్రజలందరికీ ఆందోళన కలిగించే విధంగా ఉంది. 

 

 

 అయితే కరోనా కు  సమర్థవంతమైన టీక రావాలి అంటే మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది అంటూ గతంలో  వ్యాఖ్యానించిన  బ్రిటన్ ప్రధాని.. ప్రస్తుతం  అసలు ఎప్పటికీ కరోనా వాక్సిన్  రాకపోవచ్చు అని కూడా పేర్కొన్నారు. మరోవైపు ఈ మహమ్మారి వైరస్ తో దేశం ఆర్థికంగా కుదేలు అవుతున్న నేపథ్యంలో... దేశంలో లాక్ డౌన్ ఎత్తివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ మహమ్మారి వైరస్ లు  వ్యాక్సిన్  కూడా వచ్చే అవకాశం లేదు అంటూ బ్రిటన్ ప్రధాని బోరింగ్ జాన్సన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: