ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా భూతం ఇప్పుడు మన దేశంలో విజృంభిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ లో కరోనా మహమ్మారి చెలరేగిపోతుంది.  వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. కరోనా కేసులు పెరిగిపోకుండా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పోలీసులు ఎవరినీ బయటకు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దురదృష్టవశాత్తు పోలీసులకు కూడా ఈ మద్య కరోనా వ్యాపించడం కలవర పెడుతున్న విషయం.  ఇక తమిళనాడులో కరోనా విలయం సృష్టిస్తోంది. పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య ఏ మాత్రం కట్టడి కావడంలేదు. ఈ సమయంలో ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త అక్కడి ప్రజల్లో ఆందోళనకు కారణమైంది.

 

ఏకంగా ముగ్గురు ఐపీఎస్ స్థాయి అధికారులు కరోనాకు బాధితులుగా మారారు.  ఇక్కడ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత పది రోజుల్లోనే కేసులు మూడింతలయ్యాయి. వీటిలో అత్యధికంగా చెన్నైలోనే వెలుగుచూస్తున్నాయి. ఇక, కోయంబేడు మార్కెట్ ప్రభావం  చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, అరియలూరు జిల్లాల్లో సైతం కనిపిస్తోంది. చెన్నై తర్వాత అత్యధిక కేసులు వెలుగు చూస్తున్నది ఇక్కడే. ప్రభుత్వం నిన్న విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. చెన్నైలో 4,882, తిరువళ్లూరులో 467, కడలూరులో 396, చెంగల్పట్టులో 391, అరియలూరులో 344, విళుపురంలో 299 కేసులు నమోదయ్యాయి.

 

తాజాగా ఇక ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహమ్మారి వైరస్ బారినపడ్డారని వెల్లడించారు. దీంతో వారికి చికిత్స అందిస్తున్నారు. వారితో పాటు సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌కు పంపారు. ఇప్పటి వరకు కింది స్థాయి సిబ్బంది మాత్రమే వ్యాధిబారిన పడగా.. ఇప్పుడు ఐపీఎస్ స్థాయి అధికారులు చేరడం కలవరం సృష్టిస్తోంది.  నిన్న ఒక్క రోజే 716 మందికి వ్యాధి లక్షణాలను గుర్తించారు. దీంతో ప్రస్తుతం అక్కడ 8,718 కేసులు నమోదు అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: