క‌రోనా క‌ల‌క‌లం అన్ని వ‌ర్గాల‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న త‌రుణంలో... కేద్ర ప్ర‌భుత్వం ప్ర‌తి అంశాన్ని ఒకింత సీరియ‌స్‌గానే ప‌రిశీలిస్తోంది. ఇప్ప‌టికే భారీగా 20 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనికి తోడుగా ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలకమైన ప్రతిపాదనను పరిశీలిస్తోందని తెలుస్తోంది. కోవిడ్‌-19 మహమ్మారి  సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అన్ని మార్గాలను పరిశీలిస్తోంది. చైనాలోని ఇతర దేశాల కంపెనీలను భారత్‌కు తరలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఇటీవలే ఉన్నతాధికారుల వర్గాల నుంచి సమాచా రం వెల్లడైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్‌లోకి పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ట్యాక్స్‌ హాలీడే ప్రకటించడంపై సమాలోచనలు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనను ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని బ్లూంబర్గ్‌ పేర్కొంది. 

 

 

భార‌త‌దేశంలోకి పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డం, దేశంలోని వివిధ వ‌ర్గాల‌కు మేలు చేయ‌డం అనే ల‌క్ష్యంలో భాగంగా మెడికల్‌ డివైజెస్‌, ఎలక్ట్రానిక్స్‌, టెలికం ఎక్విప్‌మెంట్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ వంటి రంగాలపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేసిన‌ట్లు స‌మాచారం. భారత్‌లో కొత్తగా 500 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టే కంపెనీలకు 10 ఏళ్ల పాటు ట్యాక్స్‌ హాలీడే ప్రతిపాదనను ఆర్థికశాఖ పరిశీలిస్తోందని బ్లూంబర్గ్‌ పేర్కొంది. మెడికల్‌ డివైజెస్‌, ఎలక్ట్రానిక్స్‌, టెలికం ఎక్విప్‌మెంట్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ వంటి రంగాలకు చెంది ఉంటే ఈ ప్రయోజ నాలను పొందొచ్చని బ్లూంబర్గ్‌ రిపోర్ట్‌ పేర్కొంది. అంతేకాకుండా కార్మికులు ఎక్కువగా ఉండే ఫుడ్‌ ప్రొసెసింగ్‌, టెక్స్‌టైల్స్‌, లేధర్‌, ఫుట్‌వేర్‌ వంటి రంగాల్లో 100 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే 4 ఏళ్లపాటు ట్యాక్స్‌ హాలీడే ఇచ్చే అవకాశముందుని మరో ప్రతిపాదనను కూడా బ్లూంబర్గ్‌ ప్రస్తావించింది. జూన్‌ 1, 2020 నుంచి మూడేళ్లలోపు కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాలి. ఈ ట్యాక్స్‌లే కాకుండా మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను సైతం కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది. 10 శాతం రేటుతో ఆరేళ్ల పాటు కనిష్ఠ కార్పొరేషన్‌ ట్యాక్స్‌ సౌకర్యాన్ని కూడా కల్పించే విషయాన్ని కూడా ఆర్థికశాఖ పరిశీలిస్తోంది. ఈ అంశాలపై ఆర్థిక శాఖ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బ్లూంబర్గ్‌ రిపోర్ట్‌ పేర్కొంది.  

 

మ‌రోవైపు దేశంలోని కంపెనీల‌కు సైతం కేంద్రం స‌హాయం కొనసాగుతోంది. ప్రభుత్వరంగ బ్యాంకులు గత రెండు నెలల్లో రూ.5.95 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. మహమ్మారి కోవిడ్‌-19 ప్రభావం తో తీవ్రంగా దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈ, వ్యవసా య, కార్పొరేటు రంగాలు మార్చి 1 నుంచి మే 8 మధ్యకాలంలో ఈ రుణాలను స్వీకరించాయ ని ఆమె వివరించారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగం కంపెనీ లు రూ.1.18 లక్షల కోట్ల రుణాలను తీసుకున్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఎంఎస్‌ఎంఈ, రిటైల్‌, వ్యవసాయం, కార్పొరేటు రంగాల నుంచి 46.74 లక్షల ఖాతాలకు రూ.5.95 లక్షల కోట్లను రుణాలుగా ఇచ్చామని కేంద్ర‌మంత్రి వివ‌రించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: