భారతదేశంలో కరోనా ప్రబలిన మొదట్లో ప్రభుత్వాలు కరోనా టెస్టులకు ఖర్చు చేసిన మొత్తం చాలా ఎక్కువే. ఒక టెస్ట్ కు కనీసం 4,500 రూపాయల వరకూ ఖర్చు చేశారు. ఇక ఫలితం రావడం కూడా 24 గంటల తర్వాతే. అప్పటి వరకూ వైద్యులు మరియు బాధితులు వేచి చూడవలసి వచ్చేది. ఇక రాపిడ్ టెస్టింగ్ కిట్లను పలు రాష్ట్ర ప్రభుత్వాలు కొరియా మరియు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోగా వాటిని కూడా ఐసీఎంఆర్ అంత కచ్చితత్వంతో రిజల్ట్స్ ను చూపించట్లేదు అని తీసి పారేశాయి. అయితే ఇకపై అంతా మారనుంది.

 

ఇకపై అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ వ్యవధిలోనే కరోనా టెస్ట్ రిజల్ట్స్ వచ్చేలా కంపెనీ ఒక నూతన పరికరాన్ని తయారు చేసింది. పశ్చిమ బెంగాల్ లోని జీసీసీ బయోటెక్ ఇండియా కంపెనీ తక్కువ ఖర్చుతోనే మరియు టెస్టులో ఫలితాలు వేగంగా వచ్చేలా ఒక కొత్త పరికరాన్ని తయారు చేసింది. దీంతో 500 రూపాయలకే కరోనా టెస్టు చేయవచ్చు అలాగే కేవలం 90 నిమిషాలు చాలా కచ్చితత్వంతో ఫలితం కూడా వచ్చేస్తుంది.

 

పరికరాన్ని రియల్ టైం కరుణ టెస్టింగ్ కిట్ అని పిలుస్తున్నారు. ఇక దీనిలో ఉన్న మరొక ఆసక్తికరమైన ఫీచర్ ఏమిటంటే ఒకేసారి ఒకే టైం లో పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహించేందుకు కూడా ఇందులో వీలు ఉంది. కేవలం 90 నిమిషాల్లో ఒక వ్యక్తికి కరోనా ఉందా లేదా అన్న విషయం కూడా తెలిసిపోతుంది.

 

అలాగే టెస్టుకు కేవ‌లం రూ.500 మాత్ర‌మే ఖ‌ర్చ‌వుతుంది. సంద‌ర్భంగా కంపెనీ ఎండీ ఆర్ మ‌జుందార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్ప‌టికే టెస్టు కిట్లు 1 కోటి వ‌ర‌కు త‌యారు చేశామ‌ని తెలిపారు. దీంతో ఎంతో డ‌బ్బు, స‌మ‌యం ఆదా అవుతాయ‌ని తెలిపారు. అలాగే క‌రోనా వ్యాప్తిని కూడా నియంత్రించ‌వ‌చ్చ‌ని అన్నారు. దీనితో కోటి కిట్లతో కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహించి కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: