ఈ మద్య కాలంలో ఎవ్వరి నోట విన్నా క్వారంటైన్‌ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది.  అసలు ఈ క్వారంటైన్ అంటే ఏమిటి? ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకిరికి వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో వ్యాధి లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేకంగా ఉంచి వారికి తగిన ట్రీట్ మెంట్ అందించడం.. అందుకోసం కనీసం పద్నాలు రోజుల పాటు వారు ఎవరినీ కలవకుండా ఉంచడం.  అయితే ఈ కరోనా పట్టణాల్లోసరి మరి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటీ? ఇదే ఇప్పుడు వలస కూలీలకు పెద్ద తలనొప్పిగా మారింది.  వలస కూలీలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల సడలింపులు ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నవారు తరలి వస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. వచ్చినవారిని క్వారంటైన్ లో ఉంచాల్సి ఉండగా గ్రామస్తులు ఊర్లోకి రానివ్వడం లేదు.

 

దాదాపు నలభై రోజుల పాటు వేరే ప్రాంతాల్లో ఉంటూ నానా అవస్థలు పడి తీరా సొంత ఊరికి చేరుకున్నా ఇప్పుడు ఇక్కడ కొత్త కష్టాలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబుబ్ నగర్  జిల్లాలోని వలస కార్మికులు మహారాష్ట్రలో ఉండటంతో ఇక్కడివారికి టెన్షన్  మొదలైంది. ముంబై, పుణె తదితర ప్రాంతాల నుంచి కార్మికులు వస్తుండడంతో ఆయా గ్రామస్తులు భయపడుతున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు నమోదు అవుతున్నాయి.. అక్కడి నుంచి వచ్చిన వారికి ఖచ్చితంగా కరోనా వైరస్ ఎటాక్ అయి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు.

 

ఇక మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు 4,500 మంది, నారాయణపేట నుంచి దాదాపు 5,000 మంది వరకు వలస కార్మికులు ఇప్పటికే గ్రామాలకు చేరుకున్నారు.  వలస కార్మికులు వస్తున్న విషయం అధికారులు ముందే గుర్తించి వచ్చిన వారికి పరీక్షలు జరిపి హోం క్వారంటైన్ లో ఉంచి వారిపై నిఘా ఉంచుతున్నారు. మరోవైపు వలస కూలీలు బయటకు వస్తున్నది గమనించిన గ్రామస్తులు కొన్ని ప్రాంతాల్లో వారిని ఊర్లోకి రాకుండా అడ్డుపడుతున్నారు. దాంతో చాలా మంది చెట్లకిందే ఉంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: