కొన్ని కొన్ని సార్లు కొంతమంది అధికారులు చేసే వాటికి నిజమైన హీరోలకు అనిపిస్తూ ఉంటుంది. ప్రాణాలకు తెగించి మరి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వృత్తి కర్తవ్యాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఉంటారు కొంతమంది అధికారులు. ఇలాంటి వాళ్లని చూస్తుంటే సెల్యూట్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. తాజాగా కాలిఫోర్నియా లోని ఓ అధికారి ఎంతో సమయస్ఫూర్తిని పాటించి  ఏకంగా  ప్రాణాలను కాపాడి నిజమైన హీరో అనిపించుకున్నాడు. అతని గొప్ప ఆలోచన సుడిగుండంలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలను కాపాడడానికి సహాయపడింది. 

 


 వివరాల్లోకి వెళితే... కాలిఫోర్నియాలోని ఏంజెల్ ఫాల్స్ వద్ద ఒక బృందం హైకింగ్ ట్రిప్ కోసం వచ్చింది. ఈ క్రమంలోనే ఆ బృందంలోని ఒక సభ్యుడు అల్లకల్లోలంగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్నాడు. తర్వాత ఆ బృందం సభ్యులు మొత్తం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతాన్ని దాటడానికి 24 ఏళ్ల వ్యక్తి ప్రయత్నిస్తున్న సమయంలో  నీటి వేగాన్ని తక్కువగా అంచనా వేసి అలాగే దాటడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ నీటిలో చిక్కుకొని సుడిగుండంలో పడి పోయాడు. ఇంతలో అదృష్టవశాత్తు ఆఫ్ డ్యూటీ కాలిఫోర్నియా హైవే పెట్రోల్ ఆఫీసర్ బ్రెంట్ డ్యాన్లి కూడా... మాదెరా  కౌంటీలోని బాస్ లేక్  వద్ద ఉన్న ప్రాంతానికి సమీపంలో తన కుటుంబంతో కలిసి ఉండగా అక్కడ జరిగిన పరిస్థితిని గమనించి ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. 

 

 నీటిలో చిక్కుకున్న సదరు వ్యక్తిని కాపాడడానికి పెద్ద సాహసమే చేశాడు అధికారి అని చెప్పాలి. అధికారి తన బ్యాక్ ప్యాక్  యొక్క పారకార్ట్ స్టైల్ పట్టిని  ఉపయోగించి ఒక చిన్న కొమ్మతో కట్టి  ఆ వ్యక్తిని పట్టుకోవడానికి విసిరాడు. ఇక నీటిలో  చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ఆ చెట్టుకొమ్మలు పట్టుకోగానే ఇతరుల సాయంతో ఆ వ్యక్తిని బయటకు లాగాడు. కాగా దీనికి సంబంధించిన వీడియోని అధికారిక సిహెచ్పి  ఫేస్బుక్ ఖాతాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారినవేళ  ప్రాణాలను కాపాడిన అధికారి పై ప్రశంసల వర్షం కురిపించారు నెటిజన్లు .

మరింత సమాచారం తెలుసుకోండి: