ఉత్తర కొరియా నియంతగా, ప్రపంచ దేశాల అధ్యక్షులలో అందరి కంటే భిన్నమైన వాడిగా పేరుపొందిన కిమ్ జోంగ్ ఉన్ ప్రతి పనిలోనూ విశిష్టతను కోరుకుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆయనపై అందరి దృష్టి ఉంటుంది. ఆయన చేసే చేష్టలు, చర్యలు ప్రతిదీ సంచలనంగానే ఉంటుంది. నలుగురు ది ఒకదారైతే , తనది మరోదారి అన్నట్లుగా ఆయన వ్యవహారం ఉంటుంది. ఆయన అధికారం దక్కించుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి పనిలోనూ ప్రతి సందర్భంలోనూ  సంచలన దిశగానే అడుగులు వేసుకుంటూ వస్తున్నారు. అలాగే వ్యక్తిగత విషయాల దగ్గరికి వచ్చేసరికి ఆయన ప్రతిదీ గోప్యంగానే ఉంచుతున్నారు. విదేశాలకు వెళ్లినా, చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. 

 
 
ఏ సందర్భంలోనూ ఎవరిని నమ్మే వ్యక్తి కాదు ఆయన. అందుకే ఆయన రక్షణ శాఖ మంత్రులను తరచుగా మార్చేస్తుంటారు . 2011 నుంచి ఇప్పటి వరకు కనీసం ఆరుగురు వ్యక్తులను ఈ విధంగా మార్చారు. తన భార్య విషయంలోనూ అదే రకంగా గోప్యత పాటిస్తూ వస్తున్నారు. కిమ్ భార్య పేరు రిసొల్ జూ.  ఇక కిమ్ లైఫ్ స్టైల్ గురించి చెప్పుకుంటే.. ఆయన తన తిండికి , తాగుడికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ తాను అందరికంటే గొప్ప వ్యక్తిని అని నిరూపించుకుంటున్నారు. ఒక పక్క తమ దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా, అవేమీ పట్టించుకోని కిమ్ తన తిండి దగ్గర నుంచి తాను తాగే మందు వరకు అన్ని బ్రాండ్లను కోరుకుంటూ వాటికోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. 
 
 
స్థానికంగా తయారుచేసే లిక్కర్ అంటే కిమ్ కు అస్సలు నచ్చదు. అందుకే అమెరికన్ బ్రాండ్ లిక్కర్ కోసం 26 వేల డాలర్లు, అలాగే తనకు ఎంతో ఇష్టమైన జర్మన్ వైన్ కోసం 95394 డాలర్లు ఖర్చు చేస్తుంటారు. ఇక తనకు ఎంతో ఇష్టమైన పంది మాంసాన్ని తరచుగా డెన్మార్క్ దేశం నుంచి దిగుమతి చేసుకుంటారు. అలాగే బ్రెజిలియన్ కాఫీ కోసం ఏకంగా 21 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇలా అన్ని విషయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ, తన తిండి కోసం భారీగా సొమ్ము లు ఖర్చు పెట్టేందుకు కిమ్ వెనకాడకుండా వార్తల్లో నిలుస్తున్నారు. ఏమైనా కిమ్ అంటే సంథింగ్ స్పెషల్.

మరింత సమాచారం తెలుసుకోండి: