చైనా. ఇపుడు ప్రపంచానికి మిత్రుడు అనలేం, కానీ శత్రువు అని మాత్రం చాలా దేశాలు సులువుగా అనేస్తున్నాయి. అమెరికా వంటి దేశాలు అయితే కఠిన ఆంక్షలు పెట్టి మరీ డ్రాగాన్ సంగతి తేల్చేస్తున్నారు. యూరోపియన్ దేశాలకు  చైనా మీద పీకల్లోతు కోపం ఉంది. ఇంకో వైపు భారత్ లాంటి దేశాలు బయటపడకపోయినా చైనాకు ఎలా బుద్ధి చెప్పాలో స్కీం సెట్ చేసి పెట్టుకున్నాయి.

 

మోడీ తాజాగా ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్ధిక ప్యాకేజ్ వెనక ఉన్న కధను చూస్తే చైనా నడ్డి విరగ్గొట్టే అదిరిపోయే ప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మోడీ స్థానిక మంత్రం వల్లె వేస్తున్నారు. అంటే ఇకపైన భారతీయులు స్వయం సమ్రుధ్ధి సాధించి తమ వస్తువులు తామే వినియోగించుకుంటారన్న మాట. ఇది దేశీయ మార్కెట్ ని  గట్టిగా పరిపుష్టి చేస్తుంది.

 

అదే సమయంలో దిగుమతులకు ఇకపైన గట్టి బ్రేక్ పడిపోతుంది. ఓ విధంగా చెప్పాలంటే భారత్ దిగుమతి సరుకుల్లో అరవై నుంచి డెబ్బై శాతం చైనా నుంచే వస్తాయి మన విదేశీ మారక ద్రవం నిల్వలు మొత్తం కరగదీసి తన ఖజనాను పెంచుకుంటున్న చైనా ఎత్తులకు భారత్ ఇంతకాలం చిత్తు అయింది. ఇపుడు చైనా అంటే కరోనా భయం వెంటాడుతున్న వేళ సహజంగానే భారతీయులు చైనా వస్తువులకు దూరంగా ఉంటారు. 

 

అదే టైంలో భారత్ కూడా స్వీయ స్వావంబన సాధించి ఆయా దిగుమతి సరుకులు అవసరమైన చోట, సొంతంగానే తయారీకి రంగం సిధ్ధం చేసుకుంటుంది. దీని వల్ల మన సంపద మనకు ఉంటుంది.  మన అవసరాలు కూడా బాగా తీరుతాయి. ఈ పరిణామంతో  దేశంలోనే పెద్ద ఎత్తున ఉపాధి, ఆర్హిక రంగాలు పరిపుష్టి అవుతాయి. విదేశీమారక ద్రవ్య నిల్వలు కూడా పదిలంగా ఉంటాయి.

 

ఈ మొత్తం మాస్టర్ ప్లాన్ తోనే మోడీ ఆర్ధిక ప్యాకేజి ప్రకటించారని అంటున్నారు. చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఊతం ఇవ్వడం అంటే పూర్తిగా స్వదేశీ మంత్రమేనని వినిపిస్తోంది. మొత్తానికి అమెరికా చెప్పి మరీ చైనాను దెబ్బ కొడుతూంటే, భారత్ మాత్రం గమ్మునుంటూనే నడ్డి విరుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: