దేశంలో కరోనా వ్యాప్తి నెలకొన్న పరిస్థితుల గురించి నిన్న జాతిని ఉద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం వినిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రసంగంలో దేశ ప్రజలందరికీ ధైర్యం ఇచ్చే విధంగా ఎన్నో వ్యాఖ్యలు చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్యంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో  దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ఏకంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశ ప్రజలందరూ ఎంతగానో హర్షం వ్యక్తం చేశారు. కాగా నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ క్లిష్ట  ఈ పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి భారీ మొత్తంలో ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్యాకేజి కి  సంబంధించిన పలు కీలకమైన వివరాలను వెల్లడిస్తూ తాజాగా దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మీడియాతో మాట్లాడారు. 

 

 

 నిన్న  దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆత్మ నిర్బర్  భారత్ అంటే... స్వయం ఆధారిత భారత్ అని ఆమె అన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్బర్  భారత్ భారతదేశానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పత్తులకు కూడా అంతర్జాతీయ మార్కెట్ను కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ముందుకు సాగుతుందని తెలిపిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్... ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి పలు వివరాలు వెల్లడించారు. 

 

 

 అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ని ... అన్ని శాఖలతో చర్చలు  చేసిన తర్వాత... ఏ శాఖకు  ఎంత మొత్తంలో ప్యాకేజీ ప్రకటిస్తున్నాము అనే పూర్తి వివరాలను వెల్లడిస్తామంటూ  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు . అయితే కేంద్ర ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చింది అంటూ ఈ సందర్భంగా గుర్తు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.... 20 లక్షల కోట్లలో ఎలాంటి ప్యాకేజీలను ప్రజలకు ప్రకటించబోతున్నట్లు అనే విషయాన్ని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: