దేశంలో ఓ వైపు కరోనా వైరస్ తో నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు.  ఓవైపు కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి.. మనిషిని మనిషి తాకడానికి భయపడిపోతున్నారు. ఇలాంటి క్లిష్ల సమయంలో కొంత మంది దారుణాలకు పాల్పపడుతున్నారు. అయితే ఏపిలో కరోనా కేసులు ఎక్కువగా కర్నూల్, గుంటూరు, కృష్ణలో నమోదు అవుతున్నాయి.  ఈ నేపథ్యంలో గుంటూరు దారుణం చోటు చేసుకుంది.  లాక్ డౌన్ సమయంలో కూడా కొంత మంది నేరాలకు పాల్పపడుతున్నారు. అర్దరాత్రి సమయంలో వృద్ద దంపతుల పై జరిగిన హత్యా ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది.. గంటల వ్యవదిలోనే పోలీసులు హత్యకు కారణం అయిన నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఆ నిందితుడు చెప్పిన విషయాలు విషయాలు విని షాక్ తిన్నారు.  

 

గుంటూరు జిల్లా  పెదకూరపాడు మండలం కాశిపాడులో దారుణ హత్య జరిగింది..స్దానికంగా నివాసం ఉంటున్న పులిపాటి రాదాకృష్ణమూర్తి,అతని భార్య వెంకట నరసమ్మ పై గుర్తుతెలియని వ్యక్తి కొడవలితో దాడికిపాల్పడి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యా కాండలో రాధా కృష్ణమూర్తి అక్కడికక్కడే మరణించారు.  ఇక తీవ్ర గాయాలపాలైన నరసమ్మను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును పోలీసులు ఛాలెంజింగ్ తీసుకోని వేగవంతంగా దర్యాప్తు కొనసాగించారు.  స్దానికంగా నివాసం ఉండే మల్లెల గోపి కదలికలు పై పోలీసులకు అనుమానం వచ్చింది.  దీంతో తమదైన శైలిలో దర్యాప్తు చేయటంతో అసలు విషయం బయటకు వచ్చింది.

 

ఇక మల్లెల గోపి విషయానికి వస్తే.. గతంలో నేర చరిత్ర ఉందని.. ఎన్నో దురలవాట్లకు బానిసై ఎక్కడబడితే అక్కడ అప్పు చేశాడని.. దాంతో ఇంట్లో వాళ్లు తరిమేశారు.దీంతో ఎలా గయినా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గ్రామంలోనే కిరానా కొట్టు నిర్వహిస్తున్న వృద్ద దంపుతల పై కన్నేశాడు..బంగారం,డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో అర్దరాత్రి సమయంలో ఒక్కడే దోపిడికి పాల్పడ్డాడు. కొడవలితో దాడికి పాల్పడి హత్య చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: