డిజిటల్ ఇండియా పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఒకరి చేతిలో స్మార్ట్ ఫోన్, అంతేనా దానికి మళ్ళీ ఇంటర్నెట్ కనెక్షన్. దీనితో ప్రజలు ఏది కావాలన్నా సెల్ ఫోన్ మీద ఆధారపడి జీవించే స్థితికి చేరామని చెప్పవచ్చు. దీనివలన మంచి ఎంత జరుగుతోందో, చెడు ప్రభావం కూడా అంతే జరుగుతోంది. ఇక మరీ ముఖ్యంగా పోర్న్ వీడియోల విషయం విపరీతంగా పెరిగిపోతోంది. వీటి వలన కొన్ని సంఘటనలు నేరాలకు కారణమవుతున్నాయి. అసలు కొందరు మైనర్లు శృంగారం అంటే ఏంటో తెలిసీ తెలియని వయసులోనే కొన్ని దారుణాలకు పాల్పడుతున్నారు.


మరీ ముఖ్యంగా ఆ విషయంలో ఎవరిని ఎలా అడగాలి మరిచిపోయి, వావివరుసలు మరచి కొందరు అఘాయిత్యాలకు దారి తీస్తున్నారు. అలాంటి ఒక దారుణ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పోర్న్ వీడియోలు చూసి ఉద్వేగం పొందిన 14 ఏళ్ల మైనర్ బాలుడు తన ఏడు సంవత్సరాల చెల్లిపై అత్యాచారం చేసిన ఘోరమైన సంఘటన ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. ఆ బాలికకు మూత్రవిసర్జన సమయంలో భయంకరమైన కడుపునొప్పి రావడం లేకపోతే రక్తస్రావం జరుగుతుండడం చూసి తన తల్లి పూర్తి వివరాలు తెలుసుకోవడంతో అసలైన భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. 


ఈ సంఘటన ఎక్కడో కాదు జరిగింది. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కూడేరు మండలంలోని ఒక గ్రామంలో జరిగింది. అయితే అక్కడ నివసిస్తున్న ఒక జంట నడుమ తరచూ వివాదాలు కొనసాగుతుండడంతో విసిగిపోయిన భార్య తన ఇద్దరు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఇకపోతే రేషన్ కార్డులో వేలిముద్ర కోసమని తన ఐదేళ్ళ చిన్నారిని తన తండ్రి సొంత ఊరికి తీసుకువచ్చాడు. ఆ సమయంలోనే ఆ చిన్నారి పై ఇలాంటి సంఘటన జరిగింది. సెల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తూ పైశాచికంగా బాలిక స్నానం చేసేందుకు వెళ్లడం గమనించిన అన్న, ఆ చిన్నారిపై లైంగిక దాడి జరిపాడు. అసలు తను చెల్లెలు అన్న సంగతి మరిచి తన కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ తర్వాత బాలిక మళ్లీ తన తల్లి వద్దకు చేరుకోగా రెండు రోజులుగా బాలిక మూత్ర విసర్జన సమయంలో బాధ పడుతుండడం చూసి అనుమానం వచ్చిన తల్లి ఆరా తీయడంతో అసలు ఘోరం బయటపడింది. 


దీనితో ఆ చిన్నారి గుండె బద్దలయ్యే విషయాన్ని తల్లికి తెలిపింది. ఆ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే బాలికను చికిత్స కోసం అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఇక ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: