కరోనా కారణంగా దేశం మొత్తం అల్లకల్లోలం అయింది. ఇప్పటికే మూడు సార్లు లాక్ డౌన్ అమలుచేశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. షాప్స్ గాని, రెస్టారెంట్స్ గాని, సినిమా హాల్స్ గాని అన్ని బంద్ చేసారు. అయితే మన ప్రధానమంత్రి ఈనెల 17 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు  కర్ణాటక ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మే 17 తర్వాత కర్ణాటకలో రెస్టారెంట్లు, సెలూన్లు, వ్యాయామకేంద్రాలు తెరుచుకుంటాయని కర్ణాటక మంత్రి సీటీ రవి బుధవారం చెప్పారు.

 

 

అక్కడితో ఆగలేదు రెడ్‌జోన్ లో ఉన్న ఏరియాల్లో కూడా ఆర్థిక కార్యకలాపాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. లాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఏమి చేయాలి, ఎలాంటి బందోబస్తు తీసుకోవాలి అనే దానిపై ఒక కార్యాచరణ అనేది ప్లాన్ చేయాలనీ అధికారులని ఆదేశించారు కర్ణాటక ముఖ్యమంత్రి. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని సూచించారు. అలాగే మిగిలిన చోట్ల ఆర్థిక కార్యకలాపాలు సవ్యంగా జరిగే విధంగా కొన్ని సడలింపులు ఇవ్వాలని తెలిపారు.

 

 

ఇంకా మే 17 తర్వాత చాలావరకూ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలకు పరిమిత సంఖ్యలో ప్రయాణికులతో అనుమతి ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. కొంతమంది ప్రయాణికులనే ఆటోలో ఎక్కించుకోవాలని  సూచించింది. ఇంకా బెంగళూరులోని మెట్రో సర్వీస్‌ను కూడా ప్రారంభించాలని, దానికి సంబంధించిన ప్లాన్ సూచించాలని  అధికారులకు ఆదేశాలు జారీ  చేసింది. ఎక్కడికక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్క్ లు విధిగా కట్టుకుంటే తప్ప కరోనాని జయించలేమని తెలిపారు..అలాగే ఎవరికివారు జాగ్రత్తలు పాటిస్తే తప్ప కరోనాని  అరికట్టలేమని సూచన. బయటకి వెళ్లి వచ్చినపుడు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుకోవడం, శానిటైగెర్ వాడడం లాంటివి చేయాలి.. గుంపులు గుంపులు గా ఎవరు ఉండకూడదు అని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: