దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే చైనాపై సంచలన ఆరోపణలు చేసిన అమెరికా కరోనా విజృంభించటానికి, అంతకు ముందు అనేక వైరస్ లు విజృంభించడానికి చైనానే కారణమని మరోసారి ఆరోపణలు చేసింది. గత 2 దశాబ్దాల్లో 5 వైరస్ లు చైనా నుంచే ఉధ్భవించాయని ఆరోపణలు చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రయాన్‌ చైనా దేశంపై సంచలన ఆరోపణలు చేశారు. 
 
ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన 2,00,000 మంది మరణాలకు చైనాదే బాధ్యత అని అన్నారు. చైనా నుంచి వచ్చే ఈ మహమ్మారులను ఇక ఎంతమాత్రం భరించలేం అంటూ వ్యాఖ్యలు చేశారు. వైరస్ లను ప్రాథమిక దశలోనే గుర్తించి కట్టడి చేయగల సామర్థ్యం చైనాకు ఉందని అన్నారు. అయితే చైనా అలా చేయకపోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. 
 
చైనా సార్స్, ఎవియన్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, కరోనా, లాంటి వ్యాధులు చైనాలో పుట్టాయని చెప్పారు. వైరస్ లను నిలువరించడంలో చైనా నిర్లక్ష్యం వహించిందని చెప్పారు. వైరస్ ల గురించి చైనాను నిలదీయాలని అన్నారు. కరోనా బయటపడిన సమయంలో అమెరికా వైద్య సిబ్బందిని పంపుతామని చెప్పినా తిరస్కరించిందని అన్నారు. వుహాన్ లోని ప్రయోగశాలలో కరోనా వైరస్ గురించి పరిశోధనలు జరుపుతున్నామని అన్నారు, 
 
మరోవైపు మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 75,000 దాటింది. ఇప్పటివరకు 24,386 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 2,415 మంది మృతి చెందారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో నిన్న 51 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1326కు చేరింది. ఏపీలో ఈరోజు 48 కొత్త కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 2137కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: