రాజకీయంగా గాను మరియు అధికారంలో వచ్చిన నాటి నుండి అనేక రీతులుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు కి కోలుకోలేని దెబ్బ జగన్ సిద్ధం చేసినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. సరైన సమయంలో గతంలో చంద్రబాబు కి కేసీఆర్ రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టారు. కేసీఆర్ ఇచ్చిన స్ట్రోక్ కి బాబు పూర్తిగా ఇరుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఏం చేయలేక తెలంగాణ నుండి పూర్తిగా తట్టాబుట్టా సర్దుకుని ఏపీకి వచ్చేశారు. అటువంటి షాకిచ్చారు కేసీఆర్. ఓటుకు నోటు కేసు ద్వారా అడ్డంగా బుక్కైన చంద్రబాబుని రాజకీయంగా కేసీఆర్ కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టారు. ఓటుకు నోటు వీడియో మరియు ఆడియో అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రలో ఎంత రచ్చ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పరిణామంతో చంద్రబాబు పూర్తిగా తెలంగాణ రాజకీయాల నుండి అవుట్ అయిపోయారు.

 

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీ అయి రాజధాని గ్రాఫిక్స్ మరియు రకరకాల హడావిడి చేశారు చంద్రబాబు. ఏపీ ప్రజలను పూర్తిగా మభ్య పెడుతూ ఆంధ్రప్రదేశ్ రైతులను సైతం వదల్లేదు. రాజధాని ప్రాంతం లో రైతులను మరియు భూమి యాజమాన్యాలను బాగా అప్పట్లో చంద్రబాబు ఇబ్బంది పెట్టినట్లు వార్తలు వచ్చాయి. తక్కువ ధరకు రైతుల దగ్గర భూములు కొనుక్కుని చంద్రబాబు తన బినామీ టిడిపి నాయకుల చేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్...ఈ విషయం లో గట్టి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని కోసం చంద్రబాబు భూములను సేకరించిన విషయం అందరికీ తెలిసినదే. అందులో అవకతవకలు జరిగినట్లు అనేక ఆరోపణలు వైసిపి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న టైంలో చేయటం మనకందరికీ తెలిసిందే.

 

అయితే తాజాగా మరోసారి అమరావతి భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. చంద్రబాబు రాజధాని భూములు కోసం సేకరించిన 33 వేల ఎకరాల్లో నాలుగు వేల ఎకరాలు అవకతవకలు జరిగినట్లు తాజాగా వైసీపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా ఈ నాలుగు వేల ఎకరాల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత జగన్ సర్కార్ దర్యాప్తు చేయించాలని రెడీ అవుతోంది. చట్టబద్ధంగా కూడా ఉల్లంఘనలు జరిగినట్లు వైసిపి ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ విషయంలో సిబిఐ చేత పూర్తి విచారణ చేస్తే అన్ని నిజాలు బయట పడే అవకాశం ఉందని జగన్ సర్కార్ ఆలోచిస్తుంది. ఒకవేళ సిబిఐ విచారణ జరిగి అమరావతి భూముల విషయంలో చంద్రబాబు సర్కార్ అవకతవకలకు పాల్పడినట్లు రుజువైతే బాబు పొలిటికల్ కెరియర్ డేంజర్ జోన్ లో పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: