ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా దేశం లో వూహన్ నగరమని మనకందరికీ తెలిసిందే. వూహన్ మార్కెట్ లో బయటపడిన ఈ వైరస్ ఒక వ్యక్తి ద్వారా వ్యాప్తి చెంది ప్రస్తుతం 200 దేశాలకు పైగా కేవలం ఆరు నెలలోనే విస్తరించింది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఈ వైరస్ వల్ల చనిపోగా కొన్ని కోట్ల మంది శరీరాలలో దాగి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలను సైతం వణికించిన ఈ వైరస్ ఇండియాలో కూడా రోజురోజుకి విస్తరిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం కోయంబేడు అనే మార్కెట్ లో ఈ కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా కు దగ్గరగా కోయంబేడు మార్కెట్ వుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదు అవటానికి కారణం కూడా కోయంబేడు మార్కెట్ అని తేలింది.

 

చిత్తూరు జిల్లా వరకు మాత్రమే కాకుండా ఈ మార్కెట్ వల్ల తూర్పుగోదావరి జిల్లాలో కేసులు నమోదు అవ్వటానికి కారణమని ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చాలావరకూ కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న దేశాలు విదేశాల నుండి వచ్చిన వారి వల్లే ఎక్కువ నష్టం చూశారు. కానీ ఇండియాలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

 

ఈ స్థాయిలో వైరస్ దేశంలో విస్తరించడానికి కారణం ఢిల్లీ మత ప్రార్థనలు అయితే తాజాగా కోయంబేడు మార్కెట్ కూడా వేదిక కావడం రాజకీయ నేతలకు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దగ్గరగా తమిళనాడు రాష్ట్రం ఉండటంతో మద్యం దుకాణాలు ఓపెన్ చేసిన సమయంలో ఆ రాష్ట్ర సరిహద్దుల నుండి గుంపులు గుంపులుగా రావడం జరిగింది. దీంతో మద్యం కొనుగోళ్లు చేసిన సమయంలో వైరస్ ఎంతమందికి వ్యాప్తిచెందింది అన్నది ఇప్పుడు టెన్షన్ గా మారింది. వూహన్ మార్కెట్ మాదిరిగానే ఇండియాలో 'కోయంబేడు మార్కెట్' ద్వారా కరోనా దాదాపు కొన్ని రాష్ట్రాలలో వ్యాప్తి చెందుతున్నట్లు ప్రభుత్వాలు కామెంట్స్ చేస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: