నిన్న కేవలం 5కేసులు మాత్రమే నమోదైన  కేరళ లో ఈ రోజు మాత్రం కొత్తగా మరో 10 కేసులు బయటపడ్డాయి. అందులో  నలుగురు విదేశాల నుండి  వచ్చిన కాగా చెన్నై నుండి వచ్చిన ఇద్దరికి  పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగతావి కాంటాక్ట్ కేసులు. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 534 కేసులు నమోదుకాగా అందులో 490 మంది బాధితులు కోలుకున్నారు. ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 41 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా ఈరోజు కూడా భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే ఈరోజు 1495 కేసులు నమోదు కాగా తమిళనాడు లో 509, ఢిల్లీ లో 359, గుజరాత్  364 కేసులు బయటపడ్డాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే  నిన్నటి వరకు ఆంద్రప్రదేశ్ లో  తగ్గుముఖం పట్టిన కరోనా ఈరోజు మళ్ళీ విజృంభించింది.  ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 48 కేసులు నమోదయ్యాయికాగా తెలంగాణ కు సంబందించిన హెల్త్ బులిటెన్  ఇంకా విడుదలకావాల్సి వుంది. టోటల్ గా ఈఒక్క రోజే దేశ వ్యాప్తంగా పాజిటవ్ కేసుల సంఖ్య 3500 దాటింది. 
 
 
ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా లో ఇప్పటివరకు 75000 కరోనా కేసులు నమోదు కాగాఅందులో 2400 మంది మరణించారు. కోలుకున్న వారి సంఖ్య 25000కు చేరడం ఒక్కటే కాస్త శుభవార్త.  మరో నాలుగు రోజుల్లో మూడో దశ లాక్ డౌన్ కూడా ముగియనుంది అయినా కూడా  కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గకపోవడంతో మరోసారి కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించనుంది. అయితే ఈ లాక్ డౌన్ లో కొత్త నిబంధనలు తీసుకురానున్నారు. ఈనెల 18వ తేదీ లోగా దానికి సంబందించిన వివరాలను ప్రకటించనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: