ఎక్కడ అవకాశం దొరుకుతుందా? ఎప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్సలు చేద్దామని రెడీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య ఓ రేంజ్ లో చెలరేగిపోతున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ..జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి దానిపై రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై విమర్సలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.

 

ఇక తాజాగా విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై కూడా బాబు, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లీకేజ్ ఘటన జరిగిందని చెబుతూ...ఆఖరికి జగన్ చేసిన కోటి  సాయంపై కూడా విమర్సలు చేశారు. విశాఖ ఘటనతో పాటు మద్యం షాపులు ఓపెన్, మద్యం ధరలు పెంచడం, కరెంట్ చార్జీలు పెరగడం, రైతులకు గిట్టుబాటు ధరలు అంటూ బాబు ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు.

 

తాజాగా కూడా పొలిట్ బ్యూరో సమావేశం పెట్టి, పలు సమస్యల పరిష్కారంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థలను నిర్మిస్తే,  వైసీపీ ప్రభుత్వం వాటిని ధ్వంసం చేసిందని ఆరోపించారు. మద్యం షాపులు ఓపెన్ చేయడంలో వల్ల కరోనా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇక పాలకులు అసమర్ధులు అయితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని బాబు భారీ డైలాగ్ వేశారు.

 

ఇక బాబు వేసిన డైలాగ్ గతంలోనే అమలు అయిపోయిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎన్ని కష్టాలు ఉన్న జగన్ ఎంత చేస్తున్నారో ప్రజలకు తెలుసని అంటున్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారని చెబుతున్నారు. ఇక పాలకులు అసమర్థులు అయితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్న విషయం కరెక్ట్ అని, కాకపోతే ఇది గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని అంటున్నారు. అనుభవం ఉందని బాబుని గెలిపిస్తే ఐదేళ్లు పాటు గ్రాఫిక్స్ చేసి, ప్రజలకు చుక్కలు చూపించారని, అందుకనే ఎన్నికల్లో ప్రజలు బాబుకు చుక్కలు చూపించారని గుర్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: