పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమై, దానికి సంబంధించిన జీవో 203ని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగకుండా రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. కానీ దీని వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, అక్కడి ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి.

 

కానీ ఏపీలో బీజేపీ కూడా జగన్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ...కేసీఆర్ పై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మాజీ టీడీపీ నేత, ప్రస్తుతం బీజేపీ నేత అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పోతిరెడ్డిపాడుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎంలు ఎప్పుడు తెలంగాణకు అన్యాయం చేయలేదని, ఏ సీఎం ఉన్నా తెలంగాణకు ప్రయోజనం చేకూర్చారని చెప్పారు.

 

ఇదే సమయంలో జగన్ వేరే అంశాల్ని పక్కకు తప్పించడానికి లాజికల్ గా ఈ వివాదం తీసుకోచినట్లు ఉందని, అమరావతి, ఎస్‌ఈసీ అంశం.. జగన్‌ నిర్ణయాలన్నీ వివాదాస్పదమవుతున్నాయని చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణం కూడా వివాదంలో చిక్కుకుంటాయని, జగన్‌ నిర్ణయాలు రాజకీయ ప్రచారానికి మాత్రమే పనికి వస్తాయని, తను చేయాలనుకుంటే కేసీఆర్‌ అడ్డుకున్నారని జగన్‌ చెప్పుకుంటారని అన్నారు. కాకపోతే జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్ట్‌లపై తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు.

 

ఇటు ఈయన ఇలా అంటుంటే అటు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా, కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు. జగన్ తో కుమ్మక్కయ్యి కేసీఆర్ ఇలా చేస్తున్నారని, ఇది ముందే ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. ఇక దీనిపై దీక్షలకు కూడా దిగి, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్సలు చేస్తున్నారు. అయితే ఇలా ఇరు ప్రభుత్వాలు కుమ్మక్కయ్యి ఇలా చేస్తున్నట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

 

కాకపోతే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని కొందరు విశ్లేషుకులు అంటున్నారు. రాయలసీమకు మేలు చేసేలాగానే జగన్ నిర్ణయం తీసుకున్నారని, కాకపోతే కేసీఆర్ ప్రభుత్వంతో  సమస్య సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: