క‌రోనా వైర‌స్ వ్యాప్తి సృష్టిక‌ర్త అనే అప‌ప్ర‌ద‌ను ఎదుర్కుంటున్న డ్రాగ‌న్ కంట్రీ చైనా మ‌న దేశం అనుస‌రించే వైఖ‌రి విష‌యంలో టెన్ష‌న్‌తో స‌త‌మ‌తం అవుతోంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అసెంబ్లీ స‌మావేశాలు ఈనెల 18వ తేదీన ప్రారంభం కానున్నా.  కోవిడ్‌19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఈ స‌మావేశాలు కీల‌కంగా మార‌నుండ‌గా ఇందులో భార‌త్ వైఖ‌రిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.  వైర‌స్ వ్యాప్తి విషయాన్ని ప్ర‌పంచ దేశాల‌కు తెలియ‌జేసేందుకు డ‌బ్ల్యూహెచ్‌వో ఆల‌స్యం చేసిన‌ట్లు అమెరికా ఆరోపిస్తుండ‌గా,, చైనాకు అండ‌గా డ‌బ్ల్యూహెచ్ఓ ఉంద‌న్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో భార‌త్ వైఖ‌రి ఎలా ఉండ‌నుంద‌నే చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

 

వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో జ‌రిగే డ‌బ్ల్యూహెచ్‌వో స‌మావేశాల్లో భార‌త్ పాల్గొన‌నుం‌ది.  ప్ర‌తి ఏడాది డ‌బ్ల్యూహెచ్‌వో అసెంబ్లీ స‌మావేశాలు స్విట్జ‌ర్లాండ్‌లోని జెనీవాలో జ‌రుగుతాయి. అక్క‌డ డ‌బ్ల్యూహెచ్‌వో విధానాల‌ను పొందుప‌రుస్తారు. డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్‌ను నియ‌మిస్తారు. బ‌డ్జెట్‌, ఆర్థిక వ్య‌వ‌హారాల గురించి కూడా నిర్ణ‌యం తీసుకుంటారు.అయితే, కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో 
 మే 18-19 తేదీల్లో జ‌రిగే జ‌వ‌ర్చువ‌ల్ స‌మావేశాలు, ఆ త‌ర్వాత 34 దేశాల స‌భ్యుల‌తో బోర్డు స‌మావేశాలు ఈ నెల 22న జ‌ర‌గ‌నున్నాయి. ఆ స‌మావేశాల్లో భార‌త్ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం కోవిడ్‌19 విష‌యంలో డైర‌క్ట‌ర్ టెడ్రోస్ గెబ్రియాసిస్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త్ తీసుకోబోయే విధానం కీల‌కం కానుం‌ది. ఈ స‌మావేశాల్లో మూడేళ్ల పాటు స‌భ్య‌దేశంగా భార‌త్ ఎన్నిక కానున్న‌ది. దీంతో ఈ స‌మావేశాల్లో భార‌త్ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశాలు ఉన్నాయి. డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి బాధ్య‌త‌యుత‌మైన స‌మాధానాలు రాబ‌ట్టేందుకు భార‌త్ ప్ర‌య‌త్నించే అవ‌కాశాలు ఉన్నాయి. 

 

 

క‌రోనా వైర‌స్ విష‌యంలో చైనాను, డ‌బ్ల్యూహెచ్‌వోను బాధ్య‌త తీసుకునేలా చేయాల‌ని అమెరికా కొన్ని దేశాల‌పై వ‌త్తిడి తెస్తున్న‌ది. డ‌బ్ల్యూహెచ్‌వోకు అమెరికా నిధులు క‌త్తిరించడ‌మే కాకుండా ఆరోగ్య సంస్థ‌లో పార‌ద‌ర్శ‌క‌త పెర‌గాల‌ని కూడా ఆ దేశం ఆదేశిస్తోంది. మ‌రోవైపు డ‌బ్ల్యూహెచ్‌వోలో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా జీ20 వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పిలుపునిచ్చారు. ప్ర‌స్తుత శ‌తాబ్ధానికి త‌గిన‌ట్లు ఆరోగ్య‌ సంస్థ మారాలన్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త్ వైఖ‌రి చైనాకు ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. మ‌హ‌మ్మారిని ఎలా ఎదుర్కొన్నాం,  గ్లోబ‌ల్ హెల్త్ మేనేజ్మెంట్ ఎలా ఉంద‌న్న అంశాల‌ను చ‌ర్చించ‌నున్న‌ట్లు విదేశాంగ మంత్రి జైశంక‌ర్ తెలిపారు. కోవిడ్ విష‌యంలో చైనాపై ఎటువంటి నిర్ణ‌యాన్ని భార‌త్ వెల్ల‌డించనుంద‌నే టెన్ష‌న్‌తో ఉన్న చైనా...భార‌త్‌ను అడ్డుకునేందుకు ఎత్తులు వేస్తున్న‌ట్లు అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: