దేశంలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కష్టాలు పడుతోంది. ఇప్పటికే మూడు సార్లు లాక్ డౌన్ విధించిన వైరస్ ఏ మాత్రం కంట్రోల్ లోకి రాలేదు. పైగా కేసులు తగ్గుతున్నాయి అనుకుంటే ఉన్న కొద్ది పాజిటివ్ కేసులు బయట పడుతున్నాయి. మోడీ ప్రభుత్వం చాలా వరకు మాటలకే పరిమితం అవుతోంది. మరోపక్క దేశంలో ఉన్న పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు అదేవిధంగా వలస కార్మికులు లాక్ డౌన్ వలన అనేక అవస్థలు పడటం జరిగింది. ప్రభుత్వాలు నగదు రూపంలో డబ్బులు ఇస్తున్నారు కానీ అది కొద్ది రోజులకే రావడంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో దాదాపు వైరస్ కొద్దిగా కంట్రోల్ అయ్యే పరిస్థితి ఏర్పడుతున్న తరుణంలో లేనిపోని రిస్కులు తీసుకునే విధంగా మోడీ సర్కార్ జనాల మీద కొత్త రూల్స్ రుద్దడం పై విమర్శలు వస్తున్నాయి.

 

మద్యం దుకాణాలు మరియు రైల్వే శాఖ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వల్ల దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్లు వైద్య నిపుణులు విమర్శలు చేస్తున్నారు. రైల్వే ప్రయాణం వల్ల చాలావరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇటువంటి నిర్ణయం దేశ ప్రజలకు శాపంగా మారే అవకాశం అంటూ వైద్య నిపుణులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల కోసం ఏర్పాటుచేసిన శ్రామిక ట్రైన్స్ వల్ల కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందిందని ఇంకా రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఈ ప్రయాణం చేసి టెస్ట్ చేయించుకుని వారు బయటకు వెళ్లి వైరస్ ని స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది.

 

ఇది రానున్న రోజులలో మరింత ప్రమాదం కాబోతుంది. అన్ని దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్స్ లాభోదిభో మంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రులు మోదీకి తెలపడం జరిగింది. దేశవ్యాప్తంగా రైళ్లను తీప్పకుండా ఆపేయాలని కోరడం జరిగింది. అయితే రైలు తీప్పడం విషయంలో కేంద్రం చాలా మొండిగా వ్యవహరించడంతో జనాల ప్రాణాలు లేనిపోని రిస్క్ లో పడినట్లే అని వైద్య నిపుణులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: