అధికార పార్టీ చేసింది ముమ్మాటికి తప్పు.. ఇలా చేసి ఉండాల్సింది కాదు.. వెంటనే వెనక్కి తీసుకోవాలి.. ప్రతిపక్ష పార్టీ నుంచి వినిపించే మాటలు ఇవే. ఇక ప్రతిపక్ష పార్టీ చేసిన తప్పుని సరి  చేస్తున్నాము  అభివృద్ధి చేసి చూపిస్తాం... ఇది అధికార పార్టీ చేస్తున్నా వ్యాఖ్యలు. ఇలా ఎవరికి వారు స్వలాభం... ప్రజలపై తమ పార్టీ ప్రభావం చూపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు. గతంలో కొంత మంది ముఖ్యమంత్రులు కారణంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను  తెలంగాణ ఆంధ్ర ప్రాంతంగా విడిపోయిన విషయం తెలిసిందే. 

 

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర అంటూ మూడు ప్రాంతాలలో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ మొన్నటివరకు త్వరలో ఆ రాజధాని అమరావతి మునిగి పోతుంది అనే కారణం చూపి ఏపీ సర్కార్ రాష్ట్రంలో మూడు రాజధానులు  నిర్వహిస్తామని రాష్ట్ర మంత అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. ఎన్నో విమర్శలు కూడా  జరిగాయి. ఈ మూడు రాజధాని లో భాగంగా.. విశాఖ కర్నూలును రాజధానిగా చేయాలని ఏపీ సర్కార్ భావించింది. 

 

 జగన్ సర్కార్  రాజధానిగా చేయాలని భావించిన కర్నూలు విశాఖపట్నం పై దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది టీడీపీ. కర్నూలు జిల్లాలో విజృంభిస్తున్న కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు, విశాఖలో గ్యాస్ లీకేజీ లను  కారణంగా చూపుతూ అక్కడ రాజధానులు  నిర్మించకూడదు అంటూ విమర్శలకు దిగుతున్నారు. అంటే ఒకప్పుడు చంద్రబాబు నిర్మించిన అమరావతి పై జగన్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తే... ప్రస్తుతం జగన్ విశాఖ, కర్నూల్ లను  రాజధాని గా మార్చాలి అనుకుంటున్నా విశాఖపట్నం పై  తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు విశ్లేషకులు.అసలు వీళ్ళకి వాళ్లకు తేడా ఏంటి...అధికార పార్టీ...ప్రతిపక్ష పార్టీ కి తేడా ఏంటి

మరింత సమాచారం తెలుసుకోండి: