సరిహద్దుల్లో ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి అందరికీ తెలిసిన విషయమే. ఓ వైపు శత్రు  దేశాలు  దాడి చేస్తుంటే వాటిని తిప్పి కొడుతూ ప్రాణాలను అడ్డుపెట్టి ప్రతి క్షణం ప్రాణంగండంతో  విధినిర్వహణలో లీనమై పోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని  ప్రయోజనాల కోసం  పాలకులు  చేసినటువంటి కొన్ని పనుల వల్ల ఎలాంటి తీవ్ర పరిస్థితులు బోర్డర్లో సైనికులు ఎదుర్కొన్నారు అనేటువంటిది  తాజాగా ఒక రిటైర్డ్ సైనికుడు రాజన్  పిఎస్ సహా ప్రస్తుతం ఒక కథనాన్ని తెలిపారు. 

 

 1971  యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ ని ప్రశంసిస్తూ అనేకమంది పోస్టులు పెట్టి అభినందించారు. వాస్తవానికి అయితే 1971లో జరిగిన యుద్ధాన్ని భారత దేశం సాంకేతికంగా గెలిచింది అని చెప్పవచ్చు. కానీ అది పూర్తిగా విఫలమైన విషయం అంటూ రిటైర్డ్ సైనికుడు తెలిపాడు . దాదాపుగా లక్షమంది యుద్ధ ఖైదీలుగా దొరికితే  వారి గురుంచి  పట్టించుకోకుండా అలాగే వదిలేశారు. వాస్తవానికి  సరిహద్దు లో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన చాలా ఆయన క్లుప్తంగా  వివరించారు  . 

 


 అయితే లక్ష మంది ఖైదీలు దొరికినప్పుడు మరొకసారి యుద్ధం చేయకుండా ఉండేలా తగిన తీర్మానం చేసేవరకూ యుద్ధ ఖైదీలను వదలను అంటూ ప్రభుత్వం చెప్పాలి కానీ... వారికి ఎలాంటి ఒప్పందం లేకుండా వదిలేయడం నిజమైన దారుణం చర్య  అంటూ రిటైర్డ్  సైనికుడు తెలిపాడు. ఇలా చేయటం  ద్వారా అప్పటినుంచి ఇప్పటివరకు భారత దేశం ఇంకా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటుంది అంటూ తెలిపారు. అప్పుడు చేసిన తప్పు కారణంగా ఇప్పటి వరకు  ఇంకా ఆ ప్రమాదాన్ని భారత్ ఫేస్ చేస్తుందని... ఈ విధంగా 1971లో జరిగిన యుద్ధంలో సక్సెస్ అయ్యాము కానీ కాలేదు  అన్నది ప్రస్తుతం రిటైర్డ్  సైనికుడు  అడుగుతున్న ప్రశ్నలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: