ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ భయబ్రాంతులకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి ఇతర దేశాలతో పోలిస్తే అగ్రరాజ్యం అమెరికాను విపరీతమైన కలవరపాటుకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దేశ పరిపాలనలో అతి కీలకమైన వైట్ హౌస్ నుంచి మొదలుకొని ఒక్క రాష్ట్రాన్ని వదలకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా కరోనా వ్యాప్తి దేశంలో ఎటువంటి అడ్డుకట్ట లేకుండా జరుగుతోంది. ఇక మరొకవైపు అమెరికన్లు ఆర్థిక సంక్షోభానికి భయపడి లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నినదిస్తున్నారు. ఆశ్చర్యకరంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అయితే మేరకు విజయం సాధించారు కూడా.

 

అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో లో అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. వారి విశ్లేషణ ప్రకారం లాక్ డౌన్ ఎత్తివేయబడిన పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చాలా వేగంగా జరుగుతోంది. ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగులే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని మరియు ఉద్యోగులకు వ్యాధిగ్రస్తుల నుండి వైరస్ ఎలా సోకిందో పరిశోధనల్లో స్పష్టమైంది. ఇంతకీ షాకింగ్ విషయం ఏమిటంటే అమెరికన్లు అమితంగా ఇష్టపడే మాంసం ద్వారానే కరోనా వ్యాప్తి జరుగుతోందట.

 

మాంసం ప్యాకింగ్ - ప్రాసెసింగ్ కేంద్రాల వద్ద నుంచి కరోనా విస్తృతి కొనసాగుతోందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. అమెరికాలోని 15 రాష్ట్రాల్లో ఇటీవల నమోదైన కేసులు దీనికి ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 28 నుంచి మే 5 తేదీ వరకు అమెరికాలోని మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ లు కారాగాల్లోని ప్రాంతాల్లోనే కరోనా కేసులు విస్తృతి పెరిగిన విషయం స్పష్టమైంది. దీంతో ప్రజలు మరింతగా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: