ప్రపంచంలో ప్రశాంతమైన జీవితం లేకుండా చేసిన వైరస్ కరోనా.. వైరస్ కు సంబంధించిన మొదటి కేసును 2019 డిసెంబర్ చివరలో వూహాన్ లో గుర్తించినట్టు చైనా ప్రకటించింది.. ఇప్పటికే చైనాలో చెలరేగిన కరోనా వైరస్ గురించిన సమాచారాన్ని ప్రపంచానికి తెలపకుండా దాచి పెద్ద ముప్పుకు కారణమైందనే విమర్శలను అంతర్జాతీయంగా ఆ దేశం ఎదుర్కొంటుదన్న విషయం తెలిసిందే.. అయితే ఈ వైరస్ వ్యాపించిన మొదట్లో దీన్ని ‘న్యూమోనియా ఆఫ్ అన్నౌన్ కాజ్’గా భావించినట్టు వెల్లడించింది.. ఇందుకు గాను డిసెంబర్ 30న వూహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ తన పరిధిలోని అన్ని మెడికల్ ఇనిస్టిట్యూట్లకు న్యూమోనియా ఆఫ్ అన్నౌన్ కాజ్ తో, ఆస్పత్రిలో చేరిన పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని అర్జంట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది.

 

 

అప్పటికే ఈ వైరస్ బారిన 27 మంది పడగా, జనం ఎవరూ బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దని, పెద్ద సంఖ్యలో గుమిగూడవద్దని, ఒకవేళ బయటకు వెళ్లాలంటే ఫేస్ మాస్కులు కట్టుకోవాలని పేర్కొంది.. ఇకపోతే వూహాన్‌లో పుట్టుకొచ్చిన ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు 2.5 లక్షలకు పైగా మరణించడ బాధాకరం.. ఇదిలా ఉండగా గడిచిన 20 ఏళ్లలో చైనా నుంచి ఐదు వ్యాధులు బయటకు వచ్చి ప్రపంచాన్ని వణికించాయని.. ఇప్పటికైనా చైనా తన వైఖరి మార్చుకోకుంటే ఎంత మాత్రం సహించమంటూ, ఇంతే కాకుండా ప్రపంచ దేశాలు చైనాను నిలదీయడానికి సిద్దపడుతున్నాయని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ ఓ బ్రైన్ అన్నారు..

 

 

ఇకపోతే  అమెరికా హెల్త్ ప్రొఫెషనల్స్ చైనా ప్రభుత్వానికి సహాయం చేసేందుకు ముందుకొచ్చినా, అది నిరాకరించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.. ఇక ప్రపంచ ఆర్థిక రంగం చైనా కారణంగా షట్ డౌన్ కావడం కూడా ఇది ఐదోసారి అని.. దీన్ని ఆపాలంటే చైనాకు ఎవరో ఒకరు సహాయం చేయాలన్నారు. చైనాకు సహాయం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని.. ఇలాంటి వ్యాధులు మళ్లీ రాకుండా ఉండేలా తాము చైనాకు సహాయం చేయగలమని రాబర్ట్ తెలిపారు.

 

 

కానీ చైనా మాత్రం పబ్లిక్ హెల్త్ గురించి ఆలోచించకుండా ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తుందని పేర్కొన్నారు.. ఏది ఏమైనా, తప్పు ఎవరు చేసిన ఈ వైరస్ మూలానా ప్రపంచ దేశాల్లో ఉన్న పేదలు అల్లాడిపోతున్నారు.. ఈ విపత్తు నుండి గుణపాఠం నేర్చుకుని రాబోయే ప్రమాదాలను పసిగట్టి నివారిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: