ప్రపంచంలో నిరుద్యోగం, ఆకలి చావులు పెరగాలని, ఆర్ధికంగా చితికి పోవాలని, ఏ మహానుభావుడు కలలు కన్నాడో గానీ, అతని కలలు నిజం అవుతున్నాయి.. దాన్ని నిజం చేయడానికి కరోనా అనే వైరస్ పనిగట్టుకుని ప్రపంచం మీద పడింది.. దీని వల్ల లోకంలో అంతర్గతంగా జరుగుతున్న దారుణాలు వెలుగులోకి రాలేకపోతున్నాయి.. బాధ అనుభవించే వాడికే గాని, అది చూస్తున్న వాడికి కాదు.. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఉద్యోగాలు కోల్పోయి ఎందరికో కుటుంబ పోషణ భారంగా మారింది.. ఒక ఫ్యామిలీ ఈ కాలంలో బ్రతకాలంటే ఎంతగా సరిపెట్టుకున్న పదివేల రూపాయలు సరిపోవు అలాంటిది రెండు మూడు వేల రూపాయలతో సరిపెట్టుకొమ్మని కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఉచితంగా దానం చేసినట్లుగా ఫీలవుతున్నాయి..

 

 

ఈ సమయంలో సంపాదించే వాడు పదిమంది పొట్ట కొట్టి బాగానే సంపాదించుకుంటున్నాడు.. ఇక నిజాయితీగా ఉన్న వాడికి ఈ లోకంలో చోటు లేదని ఇప్పటి పరిస్దితులు నిరూపిస్తున్నాయి.. గొర్రె కసాయివాన్నే నమ్మినట్లుగా మీది మాటలు చెప్పే వారికే భవిష్యత్తు ఉంది.. ఇకపోతే ఒక ఉద్యోగి తన ఉద్యోగాన్ని యజమాని తీసేశాడని తిట్టుకుని ఊరుకోలేదు.. ఆ కోపంతో అక్షరాల అతనికి 4.25 కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చాడు.. నన్నే ఉద్యోగం నుంచి పీకేస్తావా.. చూడు నీ సంగతి అంటూ ప్రతీకారం తీర్చుకున్నాడు.. అమెరికాలోని ఇల్లినాయిస్‌ లో ఇటీవల జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే.. ఇల్లినాయిస్‌లో షిప్పింగ్ బిజినెస్ చేస్తున్న ఓ యజమాని అతని డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తీసేశాడు. యజమాని సడెన్ షాక్ ఇవ్వడంతో అతనితో గొడవకు దిగిన్ ఆ డ్రైవర్ యజమానిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుని వెంటనే అమలు చేశాడు..

 

 

అదేమంటే ఆఫీస్ బయట తన యజమాని ‘ఫెర్రారీ జీటీసీ4 లుస్సో’ అనే స్పోర్ట్స్ కార్ పార్క్ చేసి ఉండడాన్ని గమనించాడు. దాన్ని చూసిందే తడవుగా ఆ కారును ఓల్వో ట్రక్కుతో ఢీకొట్టాడు. దీంతో రూ.4.25 కోట్లు విలువ చేసే కారు క్షణాల్లో ధ్వంసమైంది. ఈ ఘటనతో యజమాని ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు.. వెంటనే తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారట... 

మరింత సమాచారం తెలుసుకోండి: