జగన్... యువ ముఖ్యమంత్రి... ఆయన దూకుడు, స్పీడూ కూడా ఎవరూ అందుకోనిదే. ఈనాటి తరానికి చెందిన జగన్ కొన్ని విషయాల్లో మాత్రం పాత విలువలను నమ్ముతాడు.తాను ఇచ్చిన మాటను తప్పడు. ఇవన్నీ ఇప్పటి రాజకీయాల్లో కుదరవు. ఇక మరో విషయం జగన్ లో ఉంది. అదే ప్రత్యేకత కూడా. అదేమంటే జగన్ కి భయం లేకపోవడం. జగన్ మిన్ను విరిగి మీద పడ్డా కూడా నింపాదిగా ఉంటారు.

 

ఇపుడు దేశమేంటి, ప్రపంచమంతా కూడా కరోనాను చూసి వణికిపోతోంది. ఆ సమయంలో కరోనాని ని సరిగ్గా డీల్ చేస్తున్న వారిలో ఏపీ సీఎం ముందున్నారనే చెప్పుకోవాలి.ఎందుకంటే మానవప్రయత్నంగా చేయాల్సింది చేయడం. అదే జగన్ చేస్తున్నారు. అదే సమయంలో భయంతో చేతులు ముడుచుకుని కూర్చోకుండా కరోనాతోతో కలసి ప్రయాణించాలని కూడా తొలిగా చెప్పినవారు జగన్.

 

నిజానికి ఈ దేశంలో అనుభవం  ముఖ్యమంత్రులు అనేకమంది ఉన్నారు. ఎవరూ కూడా కరోనా వైరస్ విషయంలో అంత బోల్డ్ గా మాట్లాడలేదు. పైగా  కరోనాను అంతం చేస్తామనే తుదిదాకా  చెప్పుకొచ్చారు. జగన్ ప్రధానితో గత నెలలో జరిగిన సమావేశంలో రెండవ విడత లాక్ డౌన్ ప్రకటించక ముందే కరోనా తో కలసి ప్రాయాణం తప్పదని తేల్చేశారు.సడలింపులు అవసరం అని కూడా చెప్పారు. అదే సమయంలో తాజాగా జరిగిన సమావేశంలో కూడా జగన్ దేశం, రాష్ట్రం ముందుకు అడుగులు వేయాలంటే ఆర్ధిక ఉద్దీపన ముఖ్యమని కూడా చెప్పారు.

 

ఇవన్నీ కూడా ప్రధాని మోడీని ఆకట్టుకున్నాయట. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్  జగన్ అప్రోచ్ కి ప్రధాని మెచ్చుకున్నారని ఫోన్ చేసి మరీ జగన్ కి  చెప్పారని టాక్.  ఇక జగన్ కరోనాతో కాపురం అంటే నవ్విన వారు ఇపుడు మోడీ అదే మాట అంటే మాట్లాడడంలేదు. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే చెప్పింది. ఇపుడు ఎవరి నోట విన్నా కూడా అదే మాట. మొత్తం మీద కరోనాను అంతం చేస్తామన్నవారు మూర్ఖులుగా మిగిలిపోయారు.

 

కరోనాను కట్టడి చేస్తూ బతుకు బండిని లాగిద్దామని చెప్పిన జగనే దార్శనీకుడయ్యాడు. అందుకే  జగన్ ప్రధానికి కూడా నచ్చేశాడు. ఆర్ధిక ప్యాకేజిలు ప్రధాని ప్రకటించినా, సడలింపులు ఇచ్చినా కూడా జగన్ లాంటి వారి సూచనలు, విన్నపాల ప్రభావం అందులో ఉందని అంటున్న వారు ఉన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: