ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుకకు చైనా కారణమన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ తో పాటు గతంలో విజృంభించిన సార్స్, స్వైన్ ఫ్లూ వైరస్ లు కూడా చైనా నుంచే పుట్టుకొచ్చాయని అమెరికా చైనాపై ఆరోపణలు చేసింది. కరోనా విషయంలో ప్రపంచ దేశాలు సైతం చైనాపై విమర్శలు చేస్తున్నాయి. అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థపై కూడా ఈ విషయంలో విమర్శలు చేస్తోంది. 
 
తాజాగా అమెరికా నిఘా సంస్థలు కరోనా వైరస్ విషయంలో చైనా డబ్ల్యూహెచ్‌వోను బెదిరించిందని సంచలన ఆరోపణలు చేసింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డబ్ల్యూహెచ్‌వో వైరస్ గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయకుండా చైనా నిలువరించేందుకు ప్రయత్నించిందని పేర్కొంది. న్యూస్‌వీక్ ప్రత్యేక కథనంలో సీఐఏ తన తాజా నివేదికలో ఈ విషయాలను పొందుపరిచినట్టు పేర్కొంది. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే డబ్ల్యూహెచ్ఓకు చైనా సహాయసహకారాలను నిలిపివేస్తానని బెదిరించినట్టు సమాచారం. చైనా ఇతర దేశాల నుంచి భారీగా ఔషధాలు, వైద్య పరికరాలను దిగుమతి చేసుకుందని నిఘా వర్గాలు చైనాపై ఆరోపణలు చేశాయి. గతంలోనే డబ్ల్యూహెచ్ఓను చైనా బెదిరించినట్టు ఆరోపిస్తూ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ నివేదికను వెల్లడించగా తాజాగా మరోసారి అమెరికా నిఘా సంస్థలు ఇదే తరహా ఆరోపణలు చేశాయి. 
 
గతంలో జర్మనీ నిఘా సంస్థ డెర్‌ స్పైగల్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు ప్రకటన చేసింది. గతంలో అనేక సందర్భాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య మూడు లక్షలకు చేరువలో ఉంది. భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 78,000 దాటింది. దేశంలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 26,235కు చేరగా కరోనా మృతుల సంఖ్య 2,549కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: