ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ గురించి తాజాగా ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించింది. డబ్ల్యు.హెచ్. హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ మాట్లాడుతూ ఇలా అన్నారు - "ఒక కొత్త వైరస్ మన మానవ జీవితం లోకి మొట్టమొదటిసారి ఇంత విస్తృత స్థాయిలో వ్యాపిస్తోంది. ఇంకా ఇది ఎన్ని రోజులు మనతోనే ఉంటుంది అని అంచనా వేయడం చాలా కష్టం."

 

ఉన్న ఫలంగా లాక్ డౌన్ మీద మీద లాక్ డౌన్ లు వేయడం వల్ల కూడా జనావాసాలు నుండి వైరస్ వెంటనే మాయమయ్యే పరిస్థితి అయితే కచ్చితంగా లేదని తేల్చి చెప్పాడు. "మన అందరం కచ్చితంగా నమ్మవలసిన చేదు నిజం ఏమిటంటే.... కరోనా మహమ్మారి మన జీవితాల్లో ఇంకా చాలా రోజులు అంతర్భాగం అయిపోనుంది. కాబట్టి మనం రియాలిటీ లోకి వచ్చి జరుగుతున్న దానిని ఒప్పుకోవాలే తప్పించి ఇప్పటికి ఇప్పుడు వ్యాధి మాయం అయిపోవాలని కోరుకోవడం మాత్రం అవివేకం," అని ర్యాన్ స్పష్టం చేశాడు.

 

ఇకపోతే వ్యాక్సిన్ తయారీ ద్వారానే మనకు వైరస్ ను సమూలంగా నాశనం చేసే అవకాశం వస్తుందని మరియు తయారుచేయబడే వ్యాక్సిన్ కూడా అసాధారణ రీతిలో పని చేస్తూ ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై ఒకే రకంగా ప్రభావం చూపిస్తూ ఉండాలని చెప్పారు. కాబట్టి మన తోటి మానవులు అయిన పరిశోధకులు మరియు శాస్త్రవేత్తల పై భరోసా ఉంచి అందరం కలిసికట్టుగా నమ్మకాన్నే బాటగా చేసుకొని ఒకే దారిలో వెళ్తేనే సమస్యకు పరిష్కారం తీసుకొని రాగలమని ర్యాన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: