ఏపీ వ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల అభివృద్ధి చేసిన భూముల విక్రయానికి జగన్ ప్రభుత్వం ‘బిల్డ్‌ ఏపీ మిషన్‌’ పేరిట కార్యచరణ రూపొందించిన విషయం తెలిసిందే. ఇ వేలం ద్వారా భూములు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని నవరత్నాలు, నాడు-నేడు వంటి ప్రభుత్వ పథకాలకు వెచ్చిస్తుంది. వాస్త‌వంగా చూస్తే ఇది ఓ మంచి కార్య‌క్ర‌మే. పేదల కోసం వైఎస్ . జ‌గ‌న్మోహ న్ రెడ్డి ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తి ష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తోన్న ఈ కార్య‌క్ర‌మంపై టీడీపీ నేత‌లు అప్పుడే బుర‌ద జ‌ల్లుడు కార్య‌క్ర‌మానికి తెర‌దీశారు.

 

ఇంకా చెప్పాలంటే ఏపీలో ఉన్న టీడీపీ నేత‌లు నిర్మాణాత్మ‌క‌మైన విమ‌ర్శ‌ల‌ను ఎప్పుడో మ‌ర్చిపోయిన‌ట్టున్నారు. అయితే ఇలా భూములు అమ్మకాలు చేపట్టంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ సెటైరికల్ గా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసారు. "తల్లిదండ్రుల గొంతు కోసి చంపిన  ఉన్మాది కొడుకు త‌రువాత వారికి పెద్ద గుడి కట్టిస్తానని ప్రకటించాడట. ఉన్మాది కొడుకులాగే  రాష్ట్రంలో ఆస్తుల‌న్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి ''మిషన్ బిల్డ్ ఏపీ'' పేరు పెట్టారు జగన్ మోహన్ రెడ్డి. ఆ కార్యక్రమం పేరు ''మిషన్ బిల్డ్ ఏపీ'' కాదు ''జగన్ కిల్డ్ ఏపీ'' అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

 

అయితే గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఏపీని చంపేసే కార్యక్రమం జరిగిందని వైసీపీ కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు. అనుభవం ఉంది కదా అని రాష్ట్రాన్ని చేతులో పెడితే చంద్రబాబు అప్పులు పాలు చేసి నాశనం చేసేశారని అంటున్నారు. చంద్ర‌బాబు హయాంలో జ‌రిగిన దారుణలు గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి హ‌యాంలో కూడా జ‌ర‌గ‌లేద‌ని వైసీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక ఆ పరిస్థితులని చక్కదిద్ధేందుకే జగన్ మిషన్ బిల్డ్ ఏపీ తెచ్చారని దీని వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: