మద్యం కారణంగా రోజురోజుకి మళ్లీ దేశంలో ఘోరాలు జరగడం ఎక్కువైపోయాయి. లాక్ డౌన్ కారణంగా 45 రోజులు మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయడంతో క్రైమ్ రేట్ చాలా పడిపోయింది. దీనితో ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారని చెప్పవచ్చు. అయితే లాక్ డౌన్ 3.0 నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇక అంతే మళ్ళీ జనజీవితం అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు. 

 


ఇక అసలు విషయానికి వస్తే...  తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలంలోని ఒక వ్యక్తి తన స్నేహితుడు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. భీమారంలోని ఆనంద కాలనీకి చెందిన హరి అనే వ్యక్తిని బుధవారం నాడు సురేష్ అనే కార్ డ్రైవర్ హతమార్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన హరిబాబు తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన నీరుకుల్లా కు చెందిన తన సొంత అక్క ఇంట్లో ఆరు సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు. ఇదే క్రమంలో అదే గ్రామానికి చెందిన కార్ డ్రైవర్ గా పనిచేస్తున్న సురేష్ తో అతడికి పరిచయం ఏర్పడి వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఇదే క్రమంలో సురేష్ కు హరి కొంత సొమ్ము అప్పుగా ఇచ్చాడు.

 


అయితే లాక్ డౌన్ కారణంగా తనకు ఉపాధి కోల్పోయిన దానికోసం నేను ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని హరి కొద్దిరోజులుగా సురేష్ ని తన డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చెయ్యసాగాడు. అయితే ఇదే అంశం మీద చర్చిద్దామని మంగళవారం సాయంత్రం హరిబాబు, సురేష్ ఇంటికి వెళ్లి అక్కడ ఇద్దరు కలిసి మద్యం తాగడం మొదలు పెట్టారు. ఇలా కొనసాగుతుండగానే మధ్యలో తన బాకీ తీర్చాలని హరిబాబు సురేష్ పై ఒత్తిడి చెయ్యసాగాడు. ఇదే క్రమంలో వారి మధ్యన ఘర్షణ తిరిగి సురేష్ ఆవేశంతో కూరగాయలు కోసే కత్తితో హరిబాబు గొంతు ఛాతీ భాగంలో ఇష్టమొచ్చినట్లు పొడిచాడు. దీనితో తీవ్ర రక్తస్రావంతో హరి అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత నిందితుడు సురేష్ కేయూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయిపోయాడు. తదుపరి కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: