ప్రస్తుత రోజులలో ప్రేమించి మోసం చేసే మాయగాళ్లు చాలా ఎక్కువ అయిపోయారు. ఈ తరుణంలోనే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి ప్రియుడు పట్టించుకోకుండా పోవడంతో యువతి ఆందోళనకు దిగింది. తన ఆరు నెలల బిడ్డతో కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేసింది అభాగ్యురాలు. ఈ దారుణమైన సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో జరిగింది. 

 


ఇక పెనుబల్లికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన మోదుగు నాగరాజుని నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ అభాగ్యురాలు నమ్మి సహజీవనం చేయడం మొదలుపెట్టింది. దీని ఫలితంగా ఆమె గర్భం దాల్చి ఆరు నెలల క్రితం బాబు పుట్టాడు వారిద్దరికీ. 

 

 

ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ప్రియుడి అడగగా ముఖం చాటేశాడు. ఇక బాబు నాకు పుట్టలేదు అంటూ నాగరాజు వివాహానికి ఒప్పుకోలేదని పోవడంతో యువతి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ విషయంపై పెద్దల మధ్య పంచాయతీ నిర్వహించిన కూడా రాజు పెళ్లికి ఒప్పుకోలేదు. దీనితో మనస్థాపానికి గురైన మహిళ బిడ్డతో కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వివాహం జరిపిస్తే నేను కిందికి వస్తాను లేకపోతే కిందికి దూకేస్తాను అని అక్కడి వారిని బెదిరించింది. దీనితో అక్కడ ఉన్న గ్రామస్తులు పోలీస్ అధికారులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడం జరిగింది.. నిజానికి తన బిడ్డకు నాగరాజు తండ్రి అని, కావాలంటే dna టెస్ట్ కూడా నేను సిద్ధం అంటూ యువతి పోలీసులకు తెలియచేసింది. దీంతో పోలీసు అధికారులు ఆ యువతికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనితో ఆ మహిళ కిందికి రావడం జరిగింది. స్థానికులు పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: