ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విపత్కర సమయములో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలన అందిస్తున్నారు జగన్. ఒక పక్క కరోనా వైరస్ తో పోరాడుతూనే మరోపక్క ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ పరిపాలన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగన్ ప్రజా క్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేస్తూ పలు ఆదేశాలను జారీ చేశారు. లాక్ డౌన్ సమయములో టెలీ మెడిసిన్ ప్రవేశ పెట్టిన జగన్ దానిని మరింత సమర్థవంతంగా నడిపించేందుకు కొత్త బైకులు కొనుగోలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

 

ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1066వాహనాలు జులై 1వ తారీఖున ప్రారంభం చేయడానికి జగన్ రెడీ అవుతున్నారు. ఎమర్జెన్సీ సేవలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆరోగ్య ఆసరా పథకం లో ఇబ్బందులు రాకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులు స్పందిస్తూ షెడ్యూల్ ప్రకారం సేవలు అందిస్తున్నామని ఆ సమయంలో వైద్యులు నేరుగా రోగులకు ఫోన్ చేసి సేవలు అందిస్తున్నట్లు సీఎం జగన్ కి తెలిపారు.

 

క్షేత్ర స్థాయిలో కూడా ప్రజలకి అంత అండగా ఉన్నట్లు అధికారులు జగన్ కి తెలిపారు. ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ గురించి జగన్ మాట్లాడుతూ సకాలంలో బిల్లులు చెల్లించాలని ప్రతి మూడు వారాలకు బిల్లులు అప్లోడ్ చేసి వెంటనే మంజూరు చేయాలని ఇందులో ఎక్కడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు జగన్ ఆదేశించారు. ఈ విధంగా రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పై జగన్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: