జగన్ కి రాజకీయ సవాళ్ళు పదేళ్ళుగా ఉన్నాయి. దానికి ఇపుడు ప్రక్రుతి సవాళ్ళు తోడు అయ్యాయి. అంతే కాదు, ఆర్ధికంగా చూసుకున్నా కూడా ఖజానా కళకళలాడడంలేదు. వెలితిగా వెలవెలపోతోంది. ఇపుడు ప్రపంచం అంతా ఆర్ధికంగా ఇబ్బందులో ఉంది. కేంద్రం సాయం అసలే అంతంత మాత్రం. కరోనా నేపధ్యంలో అసలు ఉలికేట్టు పలికేట్లు లేదు. 

 

అందుకే జగన్ ఎవరు ఏమనుకున్నా ఫరవాలేదు అంటూ ప్రభుత్వ  భూముల అమ్మకానికి రెడీ అయ్యారు. రాష్ట్రంలో మూడు ప్రధాన ప్రాంతాల్లో భూముల విక్రయానికి  ఏపీ బిల్డ్ మిషం పేరిట అమ్మకాలకు తెర తీశారు. మొత్తం మూడు వందల కోట్ల రూపాయల భారీ ఆదాయం లక్ష్యంగా  ఈ భూముల విక్రయానికి తెర తీశారు. నిజంగా ఏ ప్రభుత్వానికి అయినా భూములు ఉండాలి. అవే అసలైన ఆస్తి కూడా.

 

రాష్ట్రం రేపటి రోజున  ఏదైనా అభివ్రుధ్ధి కార్యక్రమం చేపట్టాలనుకున్నా, పరిశ్రమలకు భూములు ఇవ్వాలనుకున్నా చేతిలో లాండ్ బ్యాంక్ ఉండాలి. కానీ ఏపీ సర్కార్ దాన్ని కూడా కాదనుకుని భూముల విక్రయానికి తెగించింది అంటే ఇక్కడ చూడాల్సింది ఏపీ ఖజానా పెడుతున్న విషమ పరీక్షనేనని అంటున్నారు.

 

అమ్మ పెట్టదు, అడుక్కుతిననివ్వదు అన్నట్లుగా కేంద్రం ఉలకదు, పలకదు, మరో వైపు చూసుకుంటే  ఆదాయాలు కూడా ఎక్కడా లేవు. చేతిలో చిల్లి గవ్వ లేదు. అయినా రాజకీయ విమర్శలు విపక్షాలు చేయడం తగదు అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి చూసుకుంటే ఏపీ ఖజానాను చూస్తే దివాళా తీసినట్లే ఉందని అంటున్నారు.

 

అందువల్లనే భూములు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని కూడా చెబుతున్నారు. దీని వల్ల జగన్ సర్కార్ కి మంచి పేరు కంటే చెడ్డ పేరు వచ్చినా ముందు పాలన సాగాలన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. చూడాలి  మరి ఈ పరిణామాలను.

 

మరింత సమాచారం తెలుసుకోండి: