ప్రస్తుతం ఏపీ తెలంగాణాలో వాడి వేడిగా రాజకీయాలు ఉన్నాయి. కరోనా విషయాన్ని కూడా పక్కన పెట్టి మిగతా అన్ని విషయాలపైనా వార్ రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో ముదిరిపోయింది. ఒక పక్క కరోనా , మరో పక్క విశాఖలో విష వాయువు లీకేజ్, మరో వైపు తెలంగాణ, ఆంధ్ర మధ్య ముదిరిపోయిన నది జలాల వివాదం. ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయాల్లో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. అయితే ఇవే అంశాలపై ఏపీ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు పెరిగిపోయాయి . అధికార పార్టీ చేస్తున్న, తీసుకుంటున్న ప్రతి చర్యను విమర్శించడమే పనిగా పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షం విమర్శలు చేస్తుండడంతో కొద్దీ రోజులుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.ఇక ప్రతిపక్షాల విమరలకు ధీటుగా సమాధానం చెప్పడంలో ఎప్పుడూ ముందు ఉండే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. గత టీడీపీ పాలనను మెచ్చుకుంటూ చంద్రబాబు తనకు తానే పొగుడుకోవడంపై విజయసాయి రెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్లో విమర్శలు చేశారు. 

 

23 సీట్లతో చిత్తుగా ఓడి ఏడాది తిరగకముందే... చంద్రబాబు తన పరిపాలనను తానే మెచ్చుకుంటుంటే కొత్తగా సామెత చెప్పాలనిపిస్తోంది. కోతి మొహం కోతికి ముద్దు. అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. పోతిరెడ్డిపాడు జిఓపై తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి బాబు అను-కుల మీడియా కింద మీదా పడుతోందని విజయసాయిరెడ్డి విమర్శించారు. బాబు సిఎంగా లేని రాష్ట్రం ప్రశాంతంగా ఉండొద్దని కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. 

 


ఇక మరో ట్విట్లో కాలం చెల్లిన ఆలోచనలకు ఎంత పదును పెట్టినా ప్రయోజనం ఉండదు బాబూ. అడ్డంగా దొరికి పోయావు. నేను రెండు రాష్ట్రాలు తిరుగుతున్నానని టి.డిజిపికి కంప్లెయింట్ ఇప్పించావు. మరి వైజాగ్ వెళ్లడానికి డిజిపిలను అడగకుండా కేంద్రం అనుమతి ఎందుకు కోరావు? నీ డ్రామాలు తెలియనంత అమాయకులెవరూ లేరు. అంటూ విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. 


  

మరింత సమాచారం తెలుసుకోండి: